Begin typing your search above and press return to search.

కారులో ఇంట‌ర్నెట్‌.. జియో కీల‌క నిర్ణ‌యం.. చ‌రిత్ర‌లోనే తొలిసారిగా!

By:  Tupaki Desk   |   3 Aug 2021 11:30 PM GMT
కారులో ఇంట‌ర్నెట్‌.. జియో కీల‌క నిర్ణ‌యం.. చ‌రిత్ర‌లోనే తొలిసారిగా!
X
ఫోన్ చేస్తే.. ‘‘దిస్‌ క‌స్ట‌మ‌ర్ ఈజ్ ఔటాఫ్ క‌వ‌రేజ్ ఏరియా..’’ అనే టోన్ ఇక వినిపించ‌దు. ఇంట‌ర్నెట్ ఆన్ చేస్తే.. ‘‘బ‌ఫ‌రింగ్’’ పేరుతో.. పాత తెలుగు సినిమాల్లోని ఫ్లాష్ బ్యాక్ రీల్ మాదిరిగా.. తిరిగే రింగులు ఇక క‌నిపించ‌వు. ‘‘వేరేవర్ యూ గో.. అవ‌ర్ నెట్ వ‌ర్క్ విల్ ఫాలోస్ యూ’’ అని ఒక‌ప్పుడు వినిపించిన సెల్యూలార్ నెట్వ‌ర్క్ ప్రామిస్‌.. ఇప్పుడు నిజం కాబోతోంది. అవును.. ఇందుకోసం టెలికాం చ‌రిత్ర‌లోనే స‌రికొత్త ఒప్పందం కుదిరింది. ఈ అద్భుతానికి జియో నెట‌వ్వ‌ర్క్ సిద్ధ‌మైంది. ఇది ఎలా జ‌రుగుతుంది? ఇందుకోసం రూపొందించిన విధానం ఏంటీ అన్నది చూద్దాం.

మొబైల్ నెట్వర్క్స్ నగరం, పట్టణాల్లోనే ఎక్కువ‌గా ఉంటాన్న సంగ‌తి తెలిసిందే. చిన్న చిన్న ప‌ట్ట‌ణాల్లో ఒక‌టీ అరా ఉండే ట‌వ‌ర్లు.. గ్రామీణ ప్రాంతాల్లో మ‌రింత త‌క్కువ‌గా ఉంటాయి. దీంతో.. ప్ర‌యాణం చేసేట‌ప్పుడు సిగ్న‌ల్స్ స‌రిగా అంద‌వు. మారు మూల ప్రాంతాల్లో ఈ ప‌రిస్థితి మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో.. జ‌ర్నీ చేసేవారు సిగ్న‌ల్ కోసం అవ‌స్థ‌లు ప‌డుతూనే ఉన్నారు. ఈ ప‌రిస్థితి ఎంతో కాలంగా ఉన్న‌దే. అయితే.. దీన్ని మార్చేందుకు జియో సిద్ధ‌మైంది.

మోరిస‌న్ గ్యారేజెస్ (ఎంజీ) ఇండియా నుంచి ఇప్ప‌టికే.. హెక్టార్‌, గ్లూస్ట‌ర్ మోడ‌ళ్లు భార‌తీయ రోడ్ల‌పై ప్ర‌యాణిస్తున్నాయి. అయితే.. త్వ‌ర‌లోనే మిడ్ రేంజ్ ఎస్‌యూవీని లాంఛ్ చేసేందుకు ఎంజీ మోటార్స్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా.. ఎస్‌యూవీలో ఇన్పోంటైన్ మెంట్ కి సంబంధించి అద్భుత‌మైన ఫీచ‌ర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధ‌మైంది. ఇందుకోసం జియో నెట్వ‌ర్క్ తో టై అప్ అవుతోంది.

త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌బోతున్న మిడ్ రేంజ్ ఎస్ యూవీలో నిరంత‌రం నెట్ క‌నెక్టివిటీ ఉండే ఫీచ‌ర్ ను అందుబాటులోకి తేబోతోంది ఎంజీ మోటార్స్. ఇందుకు సంబంధించిన సాంకేతిక స‌హ‌కారం జియో నెట్ వ‌ర్క్ అందించ‌నుంది. కారులో ఎప్ప‌టికీ ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ ఉండేందుకు వీలుగా ఇ-సిమ్ తోపాటు ఇత‌ర హార్డ్ వేర్‌, సాఫ్ట్ వేర్ ల‌ను జియో అందించ‌నుంది. దీనివ‌ల్ల ఈ కారులో మారుమూల ప్రాంతాల్లో ప్ర‌యాణం సాగించేట‌ప్పుడు కూడా 4జీ ఇంట‌ర్నెట్ అందుబాటులో ఉంటుంది.

కొత్త‌గా వ‌చ్చే కార్ల‌లో ఎన్నో స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి కంపెనీలు. జీపీఎస్ నేవిగేష‌న్ తోపాటు ఆడియో, వీడియోల‌కు సంబంధించిన ఫీచ‌ర్లు చాలా ఉంటున్నాయి. అయితే.. ఇందులో దాదాపు స‌ప‌గానికి పైగా ఫీచ‌ర్లు ఇంట‌ర్నెట్ తోనే ప‌నిచేస్తుంటాయి. నెట్ అందుబాటులో లేక‌పోతే.. ఈ ఫీచ‌ర్లు ప‌నిచేయ‌వు. ఈ ప‌రిస్థితి లాంగ్ డ్రైవ్ వెళ్లే వారికి ఇబ్బందిక‌రంగా మారుతోంది. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన మోరిస‌న్ గ్యారెజెస్‌.. ఈ స‌రికొత్త ఫీచ‌ర్ ను అందుబాటులోకి తెచ్చింది. దీనివ‌ల్ల ఎలాంటి మారుమూల ప్రాంతాల‌కు వెళ్లినా.. ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ అనేది క‌ట్ కాకుండా ఉంటుంది.

అయితే.. ఈ ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీని మొబైల్ నెట్వ‌ర్క్ దిగ్గ‌జం జియో నుంచి అందుకోనుంది ఎంజీ మోటార్స్‌. ఈ మేర‌కు రిల‌య‌న్స్ జియోతో ఒప్పందం చేసుకుంది. ఈ అగ్రిమెంట్ వ‌ల్ల త‌మ బ్రాండ్ మొద‌టి స్థానంలో నిలుస్తుంద‌ని ఎంజీ మోటార్స్ భావిస్తోంది. ఇది స‌రికొత్త శ‌కానికి నాంది ప‌లుకుతుంద‌ని, దీనివ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని చెబుతోంది. ఇటు జియో నెట్వ‌ర్క్ కూడా ఇదే విధ‌మైన ఆశాభావాన్ని వ్య‌క్తం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ లేని ఈ ఫీచ‌ర్ వ‌ల్ల వినియోగ‌దారులు.. నిత్యం ఆన్ల్ లైన్లోనే ఉంటార‌ని, అంత‌రాయం అనేదానికే అవ‌కాశం ఉండ‌ని చెబుతోంది జియో. మ‌రి, దీని ప‌నితీరు ఎలా ఉంటుందో చూడాలి.