Begin typing your search above and press return to search.
డేటా స్పీడ్ లో పాక్ కంటే 17 స్థానాలు అడుగునా!
By: Tupaki Desk | 27 March 2018 6:17 AM GMTమేం అంత గొప్ప.. ఇంత గొప్ప.. మా పాలనలో దేశం వృద్ధి దిశగా పరుగులు పెడుతోందంటూ తెగ కబుర్లు చెప్పే బీజేపీ నేతలు ఇప్పుడీ సర్వే మీద సమాధానం ఏం చెబుతారన్నది ప్రశ్న. డేటా వినియోగంలో ప్రపంచంలో భారీ వృద్దిరేటును సాధించిందని ప్రధాని మోడీ సైతం చంకలు గుద్దుకుంటుంటారు. కానీ.. అదంతా ఆయన పుణ్యమేమీ కాదు. ధరలు తగ్గటం.. రిలయన్స్ జియో పుణ్యమా అని మాత్రమే చెప్పాలి.
డేటా వినియోగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న భారత్.. డేటా స్పీడ్ విషయంలో మాత్రం దారుణమైన పరిస్థితిలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా డేటా వేగంలో భారత్ ర్యాంకు చూస్తే షాక్ తినాల్సిందే. మరింత దారుణమైన విషయం ఏమిటంటే.. పొరుగున ఉన్న దాయాది పాకిస్తాన్ కంటే దిగువన ఉండటం. డేటా వేగంలో పాక్ తో పోల్చినప్పుడు భారత్ ర్యాంక్ 17 స్థానాల అడుగున ఉండటం చూస్తే.. పాలకుల గొప్పతనం ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది.
మొబైల్ డేటా డౌన్ లోడ్ వేగంలోనూ.. బ్రాడ్ బ్రాండ్ డౌన్ లోడ్ వేగం విషయాల్లో అంతర్జాతీయ సగటు వేగంతో పోలిస్తే.. మనం ఎక్కడో ఉండటం కనిపిస్తుంది.
మొబైల్ డేటా సగటు వేగం విషయానికి వస్తే పాకిస్తాన్ 92 స్థానంలో నిలిస్తే.. భారత్ 109 స్థానంలో ఉండటం గమనార్హం. 2017లో సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం 8.80 ఎంబీపీఎస్ తో ఉంటే.. ఇప్పుడది 9.01 ఎంబీపీఎస్ కు చేరింది. వరల్డ్ లో
మొబైల్ డేటా డౌన్ లోడ్ అత్యధిక సగటు చూస్తే.. 62.07 ఎంబీపీఎస్ తో నార్వే అగ్రస్థానంలో నిలిచింది. ఈ లెక్కన నార్వే స్థాయిలో కాకున్నా.. అందులో సగం వేగాన్ని అందుకోవాలన్నా భారత్ కు ఎన్ని ఏళ్లుపడుతుందో?
మొబైల్ డేటా డౌన్ లోడ్ తో పోలిస్తే.. బ్రాండ్ బ్యాంక్ కనెక్షన్ల డౌన్ లోడ్ వేగం మెరుగైంది. 2017 నవంబరులో సగటు డౌన్ లోడ్ వేగం 18.82 ఎంబీపీఎస్ కాగా.. 2018 ఫిబ్రవరి నాటికి 20.72 ఎంబీపీఎస్ కు చేరింది. దీంతో జాబితాలో భారత్ స్థానం 76 స్థానం నుంచి 67 స్థానానికి ఎగబాకింది.
ఇక ప్రపంచంలో అత్యధిక బ్రాడ్ బ్యాంక్ డౌన్ లోడ్ స్పీడ్ చూస్తే.. 161.53 ఎంబీపీఎస్ లతో సింగపూర్ మొదటిస్థానంలో నిలిచింది. అంటే.. భారత్ లో ప్రస్తుతం ఇస్తున్న స్పీడ్ తో పోల్చినప్పుడు దాదాపు 8 రెట్లు పెరగాల్సి ఉందన్నమాట. అమెరికా.. చైనాతో పోలిస్తే భారతదేశంలోని వినియోగదారులు అత్యధికంగా 150 కోట్ల గిగాబైట్ల డేటా వినియోగాన్నివినియోగించినట్లుగా తేలింది. డేటా వేగానికి సంబంధించి ఓక్లా స్పీడ్ టెస్ట్ ను నిర్వహించింది.
మొబైల్ డేటా డౌన్ లోడ్ వేగంలో టాప్ 10 దేశాలు చూస్తే.. (ఫిబ్రవరి 2018 నాటికి)
1. నార్వే 62.07 ఎంబీఎపీఎస్
2. ఐస్ లాండ్ 58.44 ఎంబీఎపీఎస్
3. నెదర్లాండ్స్ 54.53 ఎంబీఎపీఎస్
4. సింగపూర్ 51.92 ఎంబీఎపీఎస్
5. యూఏఈ 51.72 ఎంబీఎపీఎస్
6. ఖతర్ 51.61 ఎంబీఎపీఎస్
7. ఆస్ట్రేలియా 50.04 ఎంబీఎపీఎస్
8. హంగేరి 46.39 ఎంబీఎపీఎస్
9. కెనడా 45.67 ఎంబీఎపీఎస్
10. బెల్జియం 45.16 ఎంబీఎపీఎస్