Begin typing your search above and press return to search.
ఎక్కడికక్కడ సెగలు.. పొగలు.. వైసీపీలో అంతర్మథనం
By: Tupaki Desk | 29 Aug 2022 9:30 AM GMTఅంతర్గత కుమ్ములాటల్లో అదికార పార్టీ నాయకులు తీరిక లేకుండా ఉన్నారని అంటున్నారు పరిశీలకు లు. ఎమ్మెల్యేల నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు కూడా.. అంతర్గత వ్యవహారాలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అంతేకాదు..వీరి మధ్య వివాదాలు.. విభేదాలను మీడియా ముందుకు కూ డా లాగుతున్నారు. దీంతో పార్టీ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. కేవలం వారం వ్యవధిలో.. నాలుగు జిల్లాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. ఆసక్తిగా మారాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్య పేట... వైసీపీ పట్టణ అధ్యక్ష పదవికి, మునిసిపల్ కో-ఆప్షన్ సభ్యత్వానికి చౌడ వరపు జగదీష్ రాజీనామా చేశారు. 2003 నుంచి ఆయన ఎమ్మెల్యే ఉదయభాను వెంట నడుస్తున్నాడు. అయితే.. కొంతకాలంగా ఉదయభాను చుట్టూ చేరిన కోటరీ లేనిపోని విభేదాలు సృష్టిస్తోందని, ఆయన దృష్టికి సమస్యలు తీసుకెళదామన్నా, ఉదయభానుకు తీరిక ఉండటం లేదనేది జగదీష్ ఆరోపణ.ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష పదవికి జగదీష్ రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. అయితే.. దీనికి స్థానిక నాయకత్వం ఆయనను దూరం చేసిందనే వాదన ఉంది.
ఏలూరు జిల్లాలో తాజాగా వెలుగు చూసిన ఘటన నివ్వెర పోయేలా చేసింది. వైసీపీకి చెందిన కార్పొరేటర్ ఒకరు.. కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతి బాహాటంగానే మీడియా ముందు చెప్పారు. మేయర్ నూర్జహాన్.. ఆమె భర్త అనధికార మేయర్‌గా వ్యవహరిస్తున్నారని.. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న తనలాంటి వారికి ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదని.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి పెరిగిపోయిందని.. కార్పొరేషన్ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా, నిర్మాణాలు చేసి.. నచ్చిన వారికి ఇచ్చేస్తున్నారని.. ఇదే మని అడిగితే.. దౌర్జన్యాలకు దిగుతున్నాయని ఆయన చెప్పారు.
కాకినాడ జిల్లాలోనూ వైసీపీ నేతల మధ్య అసమ్మతి స్వరం బయటకు వచ్చింది. ఏకంగా.. మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడిపైనే.. సొంత పార్టీ నాయకుడు తీవ్ర విమర్శలు చేశారు. పినిపే విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి, కక్ష కట్టి తమ అబ్బాయి సుభాష్ ను అమలాపురం అల్లర్ల కేసులో ఇరికించారని అమలాపురం పట్టణ వైసీపీ నాయకుడు వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం ఆరోపించారు.
తమ ఇంటి పై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారని వెల్లడించారు. మంత్రి విశ్వరూప్ తమకు కోట్లలో అప్పులు ఉన్నారని వాటిని ఎగ్గొట్టేందుకే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.. మంత్రి కుమారుడి నుంచి ప్రాణభయం ఉందన్నారు.
ఇదేమంత తేలికగా తీసుకునే విషయం కాదని.. స్థానిక వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. గుంటూరు, కృష్ణాలోని పలు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరి ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో.. ఈ అంతర్గత సెగలు పొగలను ఎప్పటికి చల్లారుస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. లేకపోతే.. ఎన్నికల నాటికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.