Begin typing your search above and press return to search.
ఓ రియల్ స్మగ్లర్ ‘సినిమా’ కథ ఏమైందంటే?
By: Tupaki Desk | 4 May 2019 4:44 AM GMTఒక్క చాన్స్.. ఒకే ఒక్క సినిమా చాన్స్ కోసం జీవితాలనే ధారపోసే వారు ఎందరో కృష్ణానగర్ గల్లీల్లో కనిపిస్తుంటారు. సినిమా అంటే ప్రేమతో కొందరు.. స్టార్ లు అయిపోదామని మరికొందరు ఎర్రబస్సులు ఎక్కొచ్చి హైదరాబాద్ లో సినిమా అవకాశాల కోసం ఏపని చేయడానికైనా వెనుకాడరు.. అవకాశం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తుంటారు.
అలానే సినిమాల్లో అవకాశం కోసం ముంబైకి ఆశగా వెళ్లిన యువకుడు చివరకు విలన్ గా మారి ఎలాంటి పనులు చేశాడో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. హైదరాబాద్ పాతబస్తీలోని కామాటీపురకు చెందిన ఇసాక్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తుండేవాడు. సినిమాలపై పిచ్చి ప్రేమతో నాలుగేళ్ల కిందట ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ముంబై వెళ్లిపోయాడు. నాలుగేళ్లు సినిమా చాన్స్ ల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. ఏ ఒక్క చాన్స్ దొరకలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మళ్లీ అవమానం భారంతో హైదరాబాద్ రాలేకపోయాడు.
క్రమంగా ఈ టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ తో ఇసాక్ మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. అలా అయిన పరిచయంతో ఓ డ్రగ్స్ ముఠాతో జతకట్టాడు. డ్రగ్స్ విక్రయిస్తూ స్మగ్లర్ గా చెలమాణీ అవుతున్నాడు. అలా క్రమంగా డ్రగ్స్ మాఫియాను విస్తరించాడు. ఆ కోవలోనే హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మేందుకు వచ్చాడు. పోలీసులకు పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఇసాక్ పై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఇసాక్ సమాచారం మేరకు అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠాకు చెందిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 28 గ్రాముల హెరాయిన్, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో గ్రాము హెరాయిన్ విలువ దాదాపు 11వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ లో ఈ ముఠా ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తుందనే విషయాలను ఆరాతీస్తున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ముంబైకి చెందిన డ్రగ్స్ స్మగ్లర్ ఉస్మాన్ షేక్ ను పట్టుకుంటే ఈ ముఠా మొత్తం బయటపడుతుందని చెప్పాడు.