Begin typing your search above and press return to search.
బాలయ్య ఇలాకా!..ఇంటింటికీ టీడీపీలో దౌర్జన్యం!
By: Tupaki Desk | 25 Oct 2017 4:47 AM GMTఏపీ సీఎం చంద్రబాబు బృహత్ లక్ష్యంతో ప్రారంభించిన ఇంటింటికీ టీడీపీ అభాసుపాలవుతోంది. ఏ జిల్లాకు ఆ జిల్లాలో నేతలు.. తమను ప్రశ్నిస్తున్న జనాలపై దౌర్జన్యానికి దిగుతున్నారు. కొన్ని చోట్ల హెచ్చరికలతో సరిపెడుతుంటే.. మరికొన్ని చోట్ల చేయాడింపు వరకు పరిస్థితి దిగజారుతోంది. దీంతో అసలు ఈ కార్యక్రమం ఉద్దేశమే పూర్తిగా దిగజారుతోంది. తాజాగా నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో జరిగిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పెద్ద గలాభా చోటు చేసుకుంది. ప్రజల సమస్యలను ఆసాంతం వినిపించుకోకుండానే టీడీపీ నేతలు ప్రజలపై దాడులకు సిద్ధమయ్యారు.
కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. హిందూపురం మునిసిపాలిటీలో ముద్దిరెడ్డిపల్లి ప్రాంతం కీలకమైనది. ఇక్కడ చేనేత కార్మికులు - వ్యాపారులు అధికంగా ఉంటారు. ఇక్కడ సరైన రోడ్లు - అవసరమైన డ్రెయినేజీలు లేవు. దీంతో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ వైసీపీ కౌన్సిలర్ నాగభూషణరెడ్డి ఆధ్వర్యంలో ముద్దిరెడ్డిపల్లి కాలనీవాసులు సోమవారం మేళాపురం క్రాస్ వద్ద రాస్తారోకో చేపట్టారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఎస్ ఐ దిలీప్ కుమార్ సర్థిచెప్పడానికి ప్రయత్నించారు. తమకు చైర్ పర్సన్ - అధికారులు గట్టి హామీ ఇస్తేగానీ ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. ఆందోళన చేస్తున్న ప్రాంతానికి సమీపంలోనే మేళాపురం ఆటో స్టాండ్ వద్ద (33వ వార్డు) ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమానికి చైర్ పర్సన్ వచ్చారని, ఆమెతో మాట్లాడిస్తామని వారిని అక్కడి నుంచి పక్కకు పంపించారు.
తమ సమస్యలపై నినాదాలు చేసుకుంటూ వస్తున్న ముద్దిరెడ్డిపల్లి వాసులను గమనించిన చైర్ పర్సన్ రావెళ్ల లక్ష్మి భర్త అయిన టీడీపీ నేత నాగరాజు - ఆ పార్టీ కౌన్సిలర్ నంజప్ప - నింకంపల్లి రామాంజి - మరికొందరు నాయకులు ఆగ్రహంతో ఊగిపోతూ ఎదురెళ్లి దుర్భాషలాడారు. అడ్డువచ్చిన వైసీపీ కౌన్సిలర్ నాగభూషణంపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించారు. కాలనీవాసులు నారాయణ, తిప్పన్న మరికొందరిపై విరుచుకుపడి దాడి చేశారు. ప్లకార్డు కర్రలతో చితకబాదారు. ‘మాకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే..’ అంటూ నాలుక మడతపెట్టి.. వేలు చూపుతూ వీరంగం వేశారు. విషయం తెలుసుకున్న ఇన్ చార్జి సీఐ వెంకటేశులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ముద్దిరెడ్డిపల్లివాసులను వెనక్కు పంపించేశారు. దీంతో ఇంటింటికీ టీడీపీ పరిస్థితి అభాసు పాలవుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.