Begin typing your search above and press return to search.
టీకా తప్పనిసరి చేసిన ఆ దేశ ప్రధాని దాడి భయంతో అండర్ గ్రౌండ్ లోకి!
By: Tupaki Desk | 31 Jan 2022 4:30 AM GMTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ చెప్పేందుకు ఉన్న పరిష్కార మార్గాల్లో ఒకటి పెద్ద ఎత్తున టీకా కార్యక్రమం చేపట్టటం. ఇవాల్టి రోజున భారత్ లో మూడో వేవ్ లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. దాని ప్రభావం తక్కువగా ఉండటానికి వేరియంట్ బలహీనంగా ఉందన్న వాదనతో పాటు.. వ్యాక్సినేషన్ భారీగా జరగటంతో.. పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే.. ప్రాశ్చాత్య దేశాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ వేసుకోమంటే ససేమిరా అనటమే కాదు.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తాజాగా ఒక అభివృద్ధి చెందిన దేశంలో వ్యాక్సినేషన్ ను సమర్థించినందుకు సదరు దేశ ప్రధాని దాడి భయంతో రహస్య ప్రదేశానికి తరలించిన వైనం బయటకు వచ్చింది. ఇంతకూ ఆ దేశం మరేదో కాదు.. కెనడా. దేశంలో కరోనా టీకా తప్పనిసరి అనే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించే నిరసనకారులు భారీగా దేశ రాజధాని ఒట్టోవాకు చేరుతున్నారు.
ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఆయన కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి పంపినట్లుగా చెబుతున్నారు. కరోనాకు చెక్ చెప్పేందుకు టీకా కార్యక్రమాన్ని తప్పనిసరి చేసింది కెనడా ప్రభుత్వం. అయితే.. దీన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు పలువురు. ‘‘ఫ్రీడం కాన్వాయ్’’ పేరుతో చేపట్టిన నిరసనలో పెద్ద ఎత్తున ట్రక్కు డ్రైవర్లు భారీ ట్రక్కులతో రాజధానికి నిరసన ర్యాలీగా బయలుదేరారు. సరిహద్దుల నుంచి దేశంలోకి వచ్చే ట్రక్కు డ్రైవర్లకు టీకా తప్పనిసరిగా చేయించుకొని ఉండాలని.. అందుకు అవసరమైన సర్టిఫికేట్ వారితో ఉండాలని నిర్ణయించింది.
దీనిపై ట్రక్కు డ్రైవర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా నిబంధనల్ని వ్యతిరేకించేవారు ఈ ట్రక్కు డ్రైవర్లకు మద్దుతు ఇస్తున్నారు. వీరంతా భారీ సంఖ్యలో రాజధానికి చేరిన నేపథ్యంలో.. దేశ ప్రధానిపై దాడి జరుగుతుందన్న అనుమానంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా రహస్య ప్రాంతానికి మార్చారు. నిరసనల్లో భాగంగా కొందరు ప్రఖ్యాత వార్ మెమోరియల్ పైకి ఎక్కి డ్యాన్సులు చేస్తున్న వైనం మీడియాలో వస్తున్నాయి.
దీనిపై కెనడా మిలటరీ ఉన్నతాధికారి జనరల్ వేన్ ఈరె.. రక్షణ మంత్రి అనితా ఆనంద్ తీవ్రంగా ఖండించారు. సైనికుల సమాధులపై ఎక్కి డ్యాన్స్ చేయటం తనను ఎంతో వేదనకు గురి చేస్తుందని వేన్ వాపోతున్నారు. ప్రజల హక్కుల కోసం..నిరసనల పేరుతో ఇలాంటి చేష్టలు సరికావంటున్నారు. దేశం కోసం పోరాడిన సైనికుల సమాధులపై ఎక్కి ఇలా నిరసన తెలపటం సరికాదంటున్నారు.రక్షణ మంత్రి అనితా ఆనంద్ మాట్లాడుతూ.. ఇది సిగ్గుతో తలవంచుకోవాలన్న ఆగ్రహాన్నివ్యక్తం చేస్తున్నారు. సైనిక సమాధులు కెనడియన్లకు పవిత్ర స్థలాలని.. దేశం కోసం పోరాడిన వారికి తగిన గౌరవం ఇవ్వాలన్నారు. నిరసనలో భాగంగా వీధుల్లోకి దాదాపు పదివేల మంది చేరిన నేపథ్యంలో.. భారీగా హింస జరిగే వీలుందని అనుమానిస్తున్నారు.
నిరసనలు హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని గతంలో ప్రధాని ట్రూడో అనుమానిస్తున్నారు. ఏమైనా.. కొవిడ్ టీకా తప్పనిసరి అని చెప్పటం ద్వారా భారీ నిరసనను ఎదుర్కొంటూ.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా దేశ ప్రధాని ఒకరు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాల్సిన రావటం.. అది కూడా కెనడా లాంటి దేశంలో చోటు చేసుకోవటం చూస్తే.. విస్మయానికి గురి చేయక మానదు.