Begin typing your search above and press return to search.

పావురాల‌న్నీ శాంతికపోతాలు కాదు!

By:  Tupaki Desk   |   17 Oct 2016 6:54 AM GMT
పావురాల‌న్నీ శాంతికపోతాలు కాదు!
X
సమాచార రవాణాలో పావురాలకు చరిత్రలో ప్రత్యేక స్థానమే ఉంది. ఒకప్పుడు ప్రేమికులకు ప్రేమలేఖల్ని మోసుకెళ్లే ఈ పావురాలు దేశాల మధ్య రాయబారాలే నడిపాయి!! అయితే అదంతా గతం.. ఇప్పుడున్నదంతా ఇంటర్నెట్ ప్రపంచం. చేతిలో చెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటే చాలు ప్రపంచంలో ఏమూలనున్న పరిచయస్తులతో అయినా ఇట్టే సంభాషించొచ్చు - సమాచారాన్ని తెలుసుకోవచ్చు పంచుకోవచ్చు. అయినా కూడా పావురాలే నమ్ముకుంటుంది పాక్ ఇప్పటికీ. ఈ శాంటి కపోతాలను పనికిమాలిన పనులకు వాడుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించారో ఏమో కానీ పాకిస్థాన్ కు చెందిన వ్యక్తులు కొందరు పావురాలతో పంజాబ్ వైపు సమాచారాన్ని పంపుతున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు ఇప్పటికే కొన్ని పావురాలను పట్టుకున్న అధికారులు వాటీ కాళ్లకు కట్టిన కాగితాల్లో ఉన్న కోడ్ బాషలను చూసి షాకయ్యారు. ఇదే క్రమంలో భారత సైనిక రహస్యాలను పాకిస్తాన్‌ కు చేరవేసేందుకు పంపిన సుమారు 153 పావురాలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరటిపండ్లు తరలించే డబ్బాల్లో ఈ పావురాలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను జంతు సంరక్షణ చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ పావురాళ్ల కాళ్లకు అయస్కాంతం రింగులు తొడిగి ఉన్నాయట. వీటికి సందేశాలు చిట్టు పంపించే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

పావురాలను పాకిస్తాన్‌ కు రహస్య సమాచారం చేరవేయడానికి వాడుతున్నట్లు తమకు సమాచారం అందిందని జమ్మూ జిసి సిమ్రాన్ దీప్ సింగ్ పిటిఐ వార్తాసంస్థతో చెప్పగా... పావురాలకు ప్రత్యేకమైన రంగు ఎందుకు వేశారనే కోణంలో కూడా సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ పావురాలను పంజాబ్ సరిహద్దుల నుంచి దక్షిణ కాశ్మీర్‌ లోని సున్నితమైన పుల్వామా జిల్లాకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/