Begin typing your search above and press return to search.

ఒక తాత‌..మ‌న‌మ‌డు..20వేల ఎంఆర్ ఎఫ్ షేర్లు

By:  Tupaki Desk   |   30 Sep 2017 6:41 AM GMT
ఒక తాత‌..మ‌న‌మ‌డు..20వేల ఎంఆర్ ఎఫ్ షేర్లు
X
ఇప్పుడు చెప్పే ఉదంతం వింటే అచ్చం ఏదో సినిమా చూసిన‌ట్లే ఉంటుంది. రియ‌ల్ గా జ‌రిగి ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ఈ ఉదంతం విన్నంత‌నే గుర్తుకొచ్చే మాట‌.. అదృష్టం త‌లుపు త‌డితే.. ద‌రిద్రం ద‌రిదాపుల్లోకి రాద‌న్న మాట‌. దాదాపు 27 ఏళ్ల క్రితం.. షేర్ మార్కెట్ అంటే ఇప్పుడున్నంత అవ‌గాహ‌న చాలామందిలో ఉండేది కాదు.

అలాంటి టైంలో ఒక వ్య‌క్తి ధైర్యం చేసి 20వేల ఎంఆర్ ఎఫ్ షేర్లు కొన్నారు. ఎందుకు కొన్నాడో స్ప‌ష్ట‌మైన కార‌ణం బ‌య‌ట‌కు రాకున్నా.. అలా కొనేశాడు. కొన్న విష‌యాన్ని ఎవ‌రికి చెప్ప‌లేదు కూడా. త‌ర్వాతి కాలంలో అమ్మాల‌నుకున్నారో ఏమో కానీ.. అలా వ‌దిలేశాడు. ఏళ్లు గ‌డిచాయి. అనుకోని రీతిలో ఆ వ్య‌క్తి కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో.. ఆయ‌న కొన్న 20వేల షేర్ల వ్య‌వ‌హారం ఎవ‌రికి తెలీలేదు. ఆసుప‌త్రిలో ఉన్న ఆయ‌న‌కు సేవ‌లు చేయ‌సాగారు ఆయ‌న కుటుంబం.

తండ్రికి సేవ‌లు చేస్తూనే కాలం గ‌డిచిపోయింది. ఆయ‌న కొడుకు కూడా మ‌ర‌ణించాడు. తాత బాధ్య‌త‌ను మ‌న‌మ‌డు భుజాన వేసుకున్నాడు. ఆయ‌న‌కు సేవ‌లు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆ తాత‌కు స్పృహ వ‌చ్చింది. దీంతో.. వారి కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. మాట‌ల మ‌ధ్య‌లో తాను కొన్న షేర్ల గురించి మ‌న‌మ‌డికి చెప్పాడు. దీంతో.. షేరు విలువ ఎంత ఉంద‌న్న విష‌యాన్ని ఒక వార్తా ఛాన‌ల్‌ కు ఫోన్ చేసిన నేప‌థ్యంలో.. ఇప్పుడున్న ధ‌ర విని అవాక్క‌య్యాడు. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.

ఏమీ తెలీకుండా.. అంచ‌నా లేకుండా కొన్న ఎంఆర్ ఎఫ్ షేరు విలువ ఇప్పుడు ఒక్కొక్క‌టే రూ.63వేలు. అంటే.. వారి ద‌గ్గ‌ర ఉన్న 20వేల షేర్లు అమ్మితే వ‌చ్చే మొత్తం అక్ష‌రాల రూ.120 కోట్లు. ఈ మొత్తాన్ని ఇప్ప‌టికిప్పుడు బ్యాంకులో వేసినా వ‌చ్చే వ‌డ్డీ నెల‌కు రూ.6.5 లక్ష‌ల నుంచి రూ.7ల‌క్ష‌ల వ‌ర‌కూ వ‌స్తుంది. సినిమాటిక్ గా ఉన్న ఉదంతంలో తాత పేరు బ‌య‌ట‌కు రాకున్నా.. మ‌న‌మ‌డి పేరు మాత్రం ర‌విగా చెబుతున్నారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఎందుకైనా మంచిది.. మీ ఇంట్లో కూడా ఇలానే పాత షేర్లు కొనేసి ప‌క్క‌న పెట్టారో పెద్దోళ్ల‌ను ఒక‌సారి అడిగి చూడండి.