Begin typing your search above and press return to search.
ఎలన్ మస్క్ కు షాక్ ఇచ్చిన ఇన్వెస్టర్లు..!!
By: Tupaki Desk | 19 Dec 2021 2:51 AM GMTప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రస్తుతం ఇరకాటంలో పడ్డారు. ఒకే ఒక్క ట్వీట్ తో అక్కడి షేర్ మార్కెట్ ను ఓ కుదుపు కుదిపేయగల వ్యక్తిగా పేరొందిన ఈ అపర కుబేరుడు అలాంటి ట్వీట్ తో తల నొప్పిని కొని తెచ్చుకున్నారు. ఇటీవల మస్క్ చేసిన ఓ ట్వీట్ పై కొందరు ఇన్వెస్టర్లు కోర్ట్ ను ఆశ్రయించారు. అతను చేసిన ట్వీట్ పై ఉన్నత స్థాయిలో కమిటీ ఒకటి వేసి విచారణ జరిపాలను కోరుతున్నారు. ఇందుక సంబంధించి కోర్టులో దావా వేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ కారణంగా తాము చాలా నష్ట పోయామని పేర్కొన్నారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అసలు మస్క్ చేసిన ట్వీట్ ఏంటీ? ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో మండి పడడానికి గల కారణం ఏంటి? అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం.
టెస్లా, స్పేస్ఎస్ లాంటి ప్రముఖ దిగ్గజ కంపెనీలకు అధినేతగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎలన్ మస్క్. ప్రపంచంలో ఉంటే అపర కుబేరుడులో ఈయన ఒకరు. మస్క్ చేసే ట్వీట్ లు తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మిని చేయగలవు. ఒక్క ట్వీట్ తో ప్రపంచంలోనే అతి విప్లవాత్మక శక్తిగా పెరుగుతున్న బిట్ కాయిన్ ను నేల చూపులు చూసేలా చేసిన ఏకైక వ్యక్తి. మరో ట్వీట్ తో అదే బిట్ కాయిన్ కు ఊపిరి ఊదిన వ్యక్తి కూడా ఇతడే. ఇంతకీ ఈయన చేసిన చేసే ట్వీట్ లో ఏముంటుంది అని అనుకుంటున్నారా? బిజినెస్ మహా అయితే ఏం చేస్తాడు వ్యాపారం చేస్తాడు. మస్క్ కూడా అదే చేశారు. కానీ ట్విట్ లతో వ్యాపారం చేశారు. ఈయన చేసే ట్వీట్ ను బట్టి చాలా కంపెనీల మార్కెట్ వ్యాల్యూ అమాంత తగ్గడం, లేదా అమాంత పెరగడం లాంటి జరుగుతాయి.
ఇటీవల మస్క్ వివిధ కారణాల వల్ల టెస్లా కార్ల కంపెనీలో ఉన్న తన వంతులో పది శాతం షేర్ ను అమ్మేస్తున్నట్లు ఇదే ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. పది శాతం మేర షేర్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇది డైరెక్ట్ గా చాలా ప్రభావం చూపింది మార్కెట్ లపై దీంతో చాల మంది ఇన్వెస్టర్లకు నష్టం కలిగింది. దీంతో వారంతా ఇప్పుడు మూకుమ్మడిగా కట్ట కట్టుకుని షేర్ల విక్రయించేశారు. ఈ భారీ కుదుపు ప్రభావం చాలా మందిపై పడింది. దీంతో కోర్ట్ లో దావా వేశారు.
ఇదిలా ఉంటే ఈ అమెరికాను కార్ల కంపెనీ అయిన టెస్లా షేర్ వ్యాల్యూను తగ్గించే విషయంలో ఎలన్ మస్క్ పై వివిధ కంపెనీలు ఈ సూట్ ను దాఖలు చేశాయి. మస్క్ చేసిన ట్వీట్ ను కోట్ చేస్తూ.. కోర్ట్ లో పిల్ వేశారు. దీంతో యూఎస్ లోని ప్రముఖ కంపెనీలు కూడా మక్స్ పై కన్నెర్ర చేశాయి. ఏదైనా ఓ నిర్ణయం ముందు నియంత్రణ సంస్థలకు సమాచారం ఇవ్వాలని కానీ ఇలా సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు యూఎస్‌లోని డెలావేర్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు ఇన్వెస్టర్లు. ఇలాంటి రగడే గతంలో కూడా జరిగింది. వాటిని సెక్యురిటి స్టాక్స్ ఎక్సేజీలు సమాచారం అందించారు.