Begin typing your search above and press return to search.

వైరస్ ను వదిలేశారు.. కనిపించని నియంత్రణ

By:  Tupaki Desk   |   2 Aug 2020 8:50 AM GMT
వైరస్ ను వదిలేశారు.. కనిపించని నియంత్రణ
X
కరోనా ప్రబలిన కొత్తలో ఏదైన కాలనీలో కరోనా వైరస్ సోకిందంటే ఆ కాలనీని దిగ్బంధించి మొత్తం శానిటైజ్ చేసి ఆ వ్యక్తుల ఇంటిని దిగ్బంధించి మందులు, కూరగాయలు సరఫరా చేస్తూ సర్వం చేశారు అధికారులు. కానీ ఇప్పుడు అన్ని తెరుచుకున్న వేళ వైరస్ సోకిన కుటుంబాలను కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ టైంలో వైరస్ నియంత్రణను అస్సలు పట్టించుకోవడం లేదు. హోం ఐసోలేషన్ లో ఉంటున్న వారి ఇళ్లకు ఇతరులు వెళ్లకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వైరస్ విజృంభణకు ఇదే కారణంగా చాలామంది భావిస్తున్నారు.

కేసుల సంఖ్యను బట్టి కాలనీలు, బస్తీలను కట్టడి ప్రాంతాలుగా చేసి కంటైన్ మెంట్ గా ప్రకటించి రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు, ప్రభుత్వ విభాగాలు ఇప్పుడు చేతులు దులుపుకుంటున్నాయి. బారికేడ్ల ఏర్పాటు.. బందోబస్తు లేనే లేదు. కరోనా సోకిన ఇంటికి స్టిక్కర్లు, బోర్డులు పెట్టడం లేదు.

ఇక వైరస్ సోకిన ఇళ్ల వద్ద బ్లీచింగ్ చల్లడం.. శానిటైజ్ చేసే ద్రావణం పిచికారీ చేయడాన్ని కూడా పారిశుధ్య విభాగాలు చేయడం లేదు. దీంతో పాజిటివ్ కేసులు స్థానికంగా తెలియక అవి ఇంటి పరిసరాలకు.. ఇళ్లలోకి వెళ్తున్న వ్యక్తులకు సోకి వైరస్ బారిన పడుతున్నారు. మొత్తంగా తెలంగాణలో ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడి చేయడాన్ని వదిలేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అందుకే నియంత్రణ లేకుండా కేసులు పెరుగుతున్నాయంటున్నారు.