Begin typing your search above and press return to search.

మన కదలికలు మొత్తం పట్టేస్తున్నారు.. అంతా ఈ మెయిల్​ ద్వారానే..!

By:  Tupaki Desk   |   3 March 2021 2:30 PM GMT
మన కదలికలు మొత్తం పట్టేస్తున్నారు.. అంతా ఈ మెయిల్​ ద్వారానే..!
X
మనం నిరంతరం నిఘాలోనే ఉన్నాం.. మనం ఏ లొకేషన్​లో ఉన్నాం.. ఆన్​లైన్​లో ఏం బ్రౌజ్​చేస్తున్నాం.. ఏం చూస్తున్నాం.. ఇలా మన ప్రతి కదలికలను కొన్ని కంపెనీలు తెలుసుకుంటున్నాయి. అది కూడా మన ఈమెయిల్స్ ద్వారానే అని తేలిపోయింది. ఇప్పుడంతా డిజిటల్​ లావాదేవీలే.. అయితే ఆన్​లైన్​లో చేసే బ్రౌజింగ్​ ఎవరికీ తెలియదని.. ప్రైవసీగా ఉంటుందని అనుకుంటాం. కానీ అదంతా తూచ్​. మనపైన కొన్ని కంపెనీలు, కొందరు సైబర్​ నేరగాళ్లు నిరంతరం నిఘా పెట్టి ఉంటారు.

అయితే అదంతా మన ఈ మెయిల్స్ ద్వారానే అని ఇప్పుడు తేలిపోయింది. స్పై పిక్సెల్స్ అని పిలిచే కొన్ని ట్రాకర్ల ద్వారా ఇమెయిల్ అకౌంట్లలో మన డేటాను సీక్రెట్‌గా ట్రాక్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఈ మెయిల్ లాగిన్ అయ్యారు? ఏమి ఓపెన్ చేశారు? ఏ డివైజ్ లో చూశారు? ఏ లొకేషన్ లో ఉన్నారు ఇలా ప్రతిదీ ట్రాక్​ చేస్తున్నారు. చాలా కంపెనీలు ఈ ట్రిక్ ద్వారానే మనపై నిఘా పెడుతున్నాయని సమాచారం. అయితే కంపెనీలు అలా మనమీద నిఘా పెట్టాయన్న విషయం కూడా మనం పసిగట్టలేం..

ప్రస్తుతం చాలామందికి ఈ మెయిల్స్‌కు స్పై ఫిక్సల్స్ మెసేజ్‌లు వస్తుంటాయి. ఆ మెసేజ్ లు కూడా ఇమేజ్ ఫైళ్ల రూపంలో లేదా జిఫ్ ఫైల్ మాదిరిగా ఉంటాయి. ఇవి మన కంటికి కనిపించవు. హైడ్​ మోడ్​లో ఉంటాయి. దీంతో మనం కనుక్కోలేం. కానీ వీటి ద్వారానే కొన్ని కంపెనీలు మన డాటాను చోరీచేస్తున్నాయి. వీటి ద్వారా మన ఐపీ అడ్రస్​ను కనుక్కొని మన బ్రౌజింగ్​ డాటా మొత్తం కొట్టేస్తున్నాయి కొన్ని కంపెనీలు. సో ఈ విషయంలో కొంత జాగ్రత్త అవసరం.