Begin typing your search above and press return to search.
లిక్కర్ కింగ్ అంత పని చేశాడా?
By: Tupaki Desk | 14 Oct 2015 9:06 AM GMTలిక్కర్ కింగ్ గా.. భారతీయ ప్లేబాయ్ గా సామాన్యుల్లో పేరున్న కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యా. ఇప్పుడంటే కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అప్పులు పాలై చరిష్మా తగ్గింది కానీ.. అయ్యగారి విలాసాల రేంజ్ ఏమిటో దేశవ్యాప్తంగా అవగాహన బాగానే ఉంది. విలాసాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయనపై ఎన్నో వివాదాలు ఇప్పటికే చుట్టిముట్టి ఉన్నాయి.
వీటన్నింటికంటే బలమైన ఆరోపణ ఇప్పుడు ఆయనపై వచ్చింది. తాజా ఆరోపణ ఆయనకు కొత్త తిప్పలు తప్పవని చెబుతున్నారు. తాజాగా విజయ్ మాల్యా మీద వచ్చిన ఆరోపణ ఏమిటంటే.. దేశంలోని పలు బ్యాంకుల నుంచి రుణాలు పొంది.. వాటిని బ్లాక్ మనీ కి సెంటర్లుగా ఉండే కొన్ని దేశాలకు తరలించారన్నది ఆరోపణ. ఇలా సేకరించిన సొమ్ము విలువ రూ.4వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
అయితే .. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విషయంలో తీవ్రమైన రుణచిక్కుల్లో పడి.. చేతులెత్తేసిన ఆయనకు ఇంత భారీ మొత్తంలో బ్యాంకులు అప్పులు ఎలా ఇచ్చాయన్నది ఒక ప్రశ్నగా మారింది. ఇలా పొందిన రూ.4వేల కోట్లకు సంబంధించి.. ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.900కోట్లకు సంబంధించి విజయ్ మాల్యా మీద కేసు నమోదు నమోదైంది. మిగిలిన వాటికి సంబంధించిన వాటిపైనా ఆయా బ్యాంకులు చర్యలు తీసుకోవటానికి సిద్ధమవుతున్నాయి.
ఇక.. ఇంత భారీ మొత్తాన్ని ఏ విధంగా విదేశాలకు తరలించారన్న అంశంపై సీబీఐ ఫోకస్ చేసింది. ఈ అంశంపై సీబీఐ ఎంట్రీతో ఈ కేసు వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ప్రశ్నగా మారింది. తాజా ఆరోపణలు మాల్యాకు పెద్ద కష్టాన్నే తీసుకొచ్చే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.