Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ ఎమ్మెల్యేల‌కు 'ఐప్యాక్' పాఠాలు ఇది క‌దా చిత్ర‌మంటే..!

By:  Tupaki Desk   |   30 Dec 2022 5:09 AM GMT
సీనియ‌ర్ ఎమ్మెల్యేల‌కు ఐప్యాక్ పాఠాలు ఇది క‌దా చిత్ర‌మంటే..!
X
అమ్మ పుట్టిల్లు గురించి మేన‌మామ‌కు చెబుతున్నార‌న‌ట్టుగా ఉందట వైసీపీ ఆధ్వ‌ర్యంలోని రాజ‌కీయ వ్యూహ బృందం ఐప్యాక్ ప‌రిస్థితి! సీనియ‌ర్లు.. కొమ్ములు తిరిగిన నాయ‌కులు చాలా మంది వైసీపీలో ఉన్నారు. వీరికి ఎక్క‌డ ఎలాంటి ప‌రిణామం ఉంటుందో.. ఏమో.. వెంట‌నే చెప్ప‌గ‌ల నాయ‌కులు.రాష్ట్రంలో గ‌తంలో మంత్రి ప‌ద‌వులు కూడా ద‌క్కించుకున్న నేత‌లు. అయితే..ఇప్పుడు ఇలాంటి వారికి ఐప్యాక్ స‌ల‌హా ఇస్తోంద‌ట‌!

దీంతో నేత‌లు మండిప‌డుతున్నారు. ''రాజ‌కీయాల గురించి మీరు మాకు చెబుతారా?'' అంటూనాయ‌కులు నిల‌దీస్తున్న ప‌రిస్థితి(అంత‌ర్గ‌తంగానే) కనిపిస్తోంది. నిజానికి వైసీపీలో చాలా మంది సీనియ‌ర్లు ఉన్నారు.

అయితే.. వారికి ప్ర‌భుత్వ ప‌రంగా పెద్ద‌గా గుర్తింపు లేకుండా పోయింద‌నే ఆవేద‌న ఒక‌టి ఉంది. పైగా.. పార్టీ లోనూ.. వారికి గుర్తింపు లేకుండా పోయింద‌నే బాధ ఉంది. ఈ నేప‌థ్యంలోఇప్పుడు ఐప్యాక్ వ‌చ్చివారిని అదిలిస్తుంటే.. మంట న‌షాళానికి ఎక్కుతోంద‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు సైలెంట్ గా ఉన్న నాయ‌కులు.. నెమ్మ‌ది నెమ్మ‌దిగా బ్లాస్ట్ అవుతున్నారు. నేరుగా ప్ర‌భుత్వంపైనే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వ విధానాల‌ను మ‌రో రూపంలో ఎండ‌గ‌డుతున్నారు. తాజాగా ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వ‌రుస‌గా రెండో రోజు కూడా.. స‌ర్కారు తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అభివృద్ధి లేకుండా పోయింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఇలాగే ఉంటే క‌ష్ట‌మ‌ని కూడా చెప్పారు.

అంటే.. వీరి ఉద్దేశం వాస్త‌వానికి ఎంతో సీనియ‌ర్లు..అనుభ‌వం మెలితిరిగిన నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ.. వారిని ప‌క్క‌న పెట్టేసి..ఎక్క‌డో ఉత్త‌రాది నుంచి తెచ్చుకున్న ఐప్యాక్‌తో ముందుకు సాగ‌డమేన‌ని అంటున్నారు.

మొత్తానికి ఒక‌వైపు ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌కపోవ‌డంతో నియోజ‌క‌వ‌ర్గాల్లోఅభివృద్ధి లేద‌ని నాయ‌కులు త‌ల్ల‌డిల్లుతుంటే.. నువ్వు అటు వెళ్లు.. ఇటు వెళ్లు అంటూ ఐప్యాక్‌.. అదిలించ‌డం.. వారికి పాఠాలు చెప్పే ప్ర‌య‌త్నం వంటివి నాయ‌కుల‌కు ఇబ్బందిగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.