Begin typing your search above and press return to search.
ఐపాక్ సర్వే : వైసీపీ ఎమ్మెల్యేలకు భారీ షాక్ ...?
By: Tupaki Desk | 19 July 2022 7:30 AM GMTవైసీపీ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐ పాక్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ సంస్థ ఎప్పటికపుడు సర్వేలు చేస్తూ ఫలితాలను అధినాయకుని చేతిలో ఉంచుతోంది. దాన్ని ఆధారం చేసుకుని జగన్ ఎమ్మెల్యేలకు ఘాటుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఐపాక్ లేటెస్ట్ సర్వే నివేదికలు చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలకు భారీ షాకులే తగిలాయని చెప్పకతప్పదు. మొత్తం 151 మంది ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పట్ల పెద్దగా దృష్టి పెట్టడంలేదని తేలింది.
ఇక వీరిలో 22 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారని అంటున్నారు. ఇలా గడప గడపకు వీరు కేవలం పది రోజులు మాత్రమే వెళ్ళి అలా వచ్చేశారని అంటున్నారు. వీరే ఇలా ఉంటే మరో పదిహేను మంది ఎమ్మెల్యేలు జస్ట్ అయిదు రోజులు మాత్రమే గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో మరీ లీస్ట్ గా కేవలం రెండు రోజులు మాత్రమే ఈ ప్రొగ్రాం లో కనిపించి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీ మంత్రి ఆళ్ల నాని ఇళ్ళకు పరిమితం అయ్యారని సర్వే నివేదిక వెల్లడించిందట.
అంటే టోటల్ గా నలభై మంది ఎమ్మెల్యేలు నాన్ సీరియస్ గా ఉన్నారని జగన్ చేతికి అందిన సర్వే నివేదిక సారాశం. దీన్ని తన వద్ద ఉంచుకున్న జగన్ తాజాగా జరిగిన వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలకు క్లాస్ బాగానే తీసుకున్నారని తెలుస్తోంది. మీరు నాన్ సీరియస్ గా ఉంటే నష్టం మీకే అని ఆయన నిర్మొహమాటంగా చెప్పేశారు. మీరు ఎమ్మెల్యేలుగా తిరిగి గెలవాలీ అంటే గడప గడపకూ తిరగడం కంటే వేరే మార్గం లేదని కూడా తేల్చేశారు.
ఈ విషయంలో మీరు తటపటాయించినా మనకెందుకులే అని నెమ్మదించినా కూడా అధినాయకత్వం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారని చెబుతున్నారు. మీ నియోజకవర్గాలలో కొత్త ముఖాలను కూడా తీసుకువచ్చి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి వెనకాడబోమని జగన్ స్పష్టం చేశారని అంటున్నారు. పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని నేను కష్టపడుతున్నాను, అదే విధంగా అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
వైసెపీ పధకాల వల్ల 83 శాతం కుటుంబాలు ఏపీలో లబ్ది పొందుతున్నాయని, ఇవన్నీ వైసీపీకి కలసి వచ్చే అంశాలు అని సీఎం అన్నట్లుగా భోగట్టా. మీరు కనుక ఈ సమయంలో ఈ అవకాశాన్ని అనుకూలతను వాడుకోకపోతే నష్టం మీకే అని కూడా జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇక వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలు కావాలీ అంటే నిత్యం జనాల్లో ఉండాలని జగన్ సూచించారు అని అంటున్నారు. పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా నేను చేయాల్సింది చేస్తున్నాను, ఇక మీ చేతిలోనే ఉంది మీరు ఎమ్మెల్యే అవుతారో లేదో అని జగన్ తేల్చేసినట్లుగా చెబుతున్నారు.
రానున్న నెలలో కనీసంగా 21 రోజులు అయినా జనాల్లో ఉండాలని, అలాగే ఏడుకు తగ్గకుండా సచివాలయాలను సందర్శించాలని జగన్ సూచించినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రతీ సచివాలయం పరిధిలో పాతిక లక్షల రూపాయల నిధులను ఇస్తున్నామని, వాటిలో స్థానికంగా అభివృద్ధి పనులు చేపట్టాలని జగన్ కోరారని అంటున్నారు. ఇక ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కింద రెండు కోట్లు ఇస్తున్నట్లుగా ఆయన తెలియచేశారు.
మొత్తానికి తన చేతిలో ఏమీ లేదని, ఎమ్మెల్యేలు తిరిగి గెలిచేందుకు జనంలో ఉండాల్సిందే అని జగన్ హుకుం జారీ చేశారు. అదే టైమ్ లో ఇప్పటికైనా మించిపోయినది లెదని, రానున్న రోజుల్లో గడప గడపకూ తిరిగితే ఫలితాలు అవే వస్తాయని కూడా ఆయన చెప్పారని అంటున్నారు. మొత్తానికి ఐపాక్ నివేదిక కాదు కానీ వైసీఈలో దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని తేలడం పార్టీలో చర్చనీయాంశం అయింది అంటున్నారు.