Begin typing your search above and press return to search.

విడుదలైన ఐఫోన్‌ 13 మొబైల్స్ ... ఇండియాలో ధర ఎంతంటే !

By:  Tupaki Desk   |   15 Sep 2021 5:41 AM GMT
విడుదలైన ఐఫోన్‌ 13 మొబైల్స్ ... ఇండియాలో ధర ఎంతంటే !
X
మార్కెట్లో కి ప్రతి రోజు కూడా ఎన్నో రకాల స్మార్ట్‌ ఫోన్లు విడుదలవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ విడుదల చేస్తున్నాయి ఆయా మొబైల్‌ కంపెనీలు. ఇక టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఫోన్‌ గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. దీని నుంచి మరో ఫోన్‌ విడుదలైంది. ఇక యాపిల్‌ మంగళవారం కొత్త ఐఫోన్‌ 13 మోడల్స్‌ ను ఆవిష్కరించింది. ఐఫోన్ 13 మినీ , ఐఫోన్ 13 , ఐఫోన్ 13 ప్రో , ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ని పరిచయం చేసింది యాపిల్. ఈ స్మార్ట్‌ ఫోన్ల ధరలు ఇండియాలో రూ.69,900 నుంచి ప్రారంభం అవుతాయి. తక్కువ ధరలో కావాలంటే ఐఫోన్ 13 మినీ కొనొచ్చు.

ప్రీమియం స్మార్ట్‌ ఫోన్ కావాలంటే ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ కొనాలి. ప్రతీ ఏడాది సెప్టెంబర్‌ లో యాపిల్ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్స్, గ్యాడ్జెట్స్ వస్తుంటాయి. అందులో భాగంగా ఇప్పుడు నాలుగు కొత్త ఐఫోన్ స్మార్ట్‌ ఫోన్స్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది. గత ఏడాది వచ్చిన ఐఫోన్‌ 12 మోడల్‌తో పోల్చితే 13లో కొద్దిపాటి మార్పులు చేశారు. కెమెరా సెన్సార్‌, మెరుగైన అల్ట్రావైడ్‌ కెమెరాల్ని అమర్చారు. ఐఫోన్‌ 13 మోడల్‌ 6.1 అంగుళాలు, ఐఫోన్‌ 13 మిని 5.4 అంగుళాలలో 128 జీబీ, 64 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లు ఉన్నాయి. ఐఫోన్‌ 13 ప్రొ మోడల్‌ 6.1 అంగుళాలు, ఐఫోన్‌ ప్రొ మ్యాక్స్‌ 6.7 అంగుళాలు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్‌ వెర్షన్లతో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ నెల 17 నుంచి ముందస్తు బుకింగ్‌ లు చేసుకోవచ్చు.

ఐఫోన్ 13 మినీ స్పెసిఫికేషన్స్

ఐఫోన్ 13 మినీ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ ఫోన్. 128జీబీ వేరియంట్ ధర రూ.69,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.79,900. ఇక హైఎండ్ వేరియంట్ 512జీబీ ధర రూ.99,900. ఐఫోన్ 13 మినీ స్మార్ట్‌ ఫోన్‌ లో 5.4 అంగుళాల డిస్‌ ప్లే ఉంది. 6 కోర్ సీపీయూ, 4 కోర్ జీపీయూ, 16 కోర్ న్యూరల్ ఇంజిన్‌ తో ఉన్న ఏ15 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. పింక్, బ్లూ, మిడ్‌ నైట్, స్టార్‌ లైట్, ప్రొడక్ట్ రెడ్ కలర్స్‌ లో కొనొచ్చు. మీ పాత స్మార్ట్‌ ఫోన్ ఎక్స్‌ ఛేంజ్ చేస్తే రూ.9,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. సెప్టెంబర్ 17న ప్రీ ఆర్డర్ మొదలవుతుంది. సెప్టెంబర్ 24 నుంచి షిప్పింగ్ మొదలవుతుంది.


ఐఫోన్ 13 స్పెసిఫికేషన్స్

ఐఫోన్ 13 స్మార్ట్‌ ఫోన్ 128జీబీ వేరియంట్ ధర రూ.79,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.89,900. ఇక హైఎండ్ వేరియంట్ 512జీబీ ధర రూ.1,09,900. ఐఫోన్ 13 స్మార్ట్‌ ఫోన్‌ లో 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉంది. 6 కోర్ సీపీయూ, 4 కోర్ జీపీయూ, 16 కోర్ న్యూరల్ ఇంజిన్‌ తో ఉన్న ఏ15 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. పింక్, బ్లూ, మిడ్‌నైట్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్ కలర్స్‌లో కొనొచ్చు. మీ పాత స్మార్ట్‌ ఫోన్ ఎక్స్‌ ఛేంజ్ చేస్తే రూ.9,000 నుంచి రూ.46,120 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. సెప్టెంబర్ 17న ప్రీ ఆర్డర్ మొదలవుతుంది. సెప్టెంబర్ 24 నుంచి షిప్పింగ్ మొదలవుతుంది.

ఐఫోన్ 13 ప్రో స్పెసిఫికేషన్స్

ఐఫోన్ 13 ప్రో స్మార్ట్‌ ఫోన్ 128జీబీ వేరియంట్ ధర రూ.1,19,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.1,29,900. ఇక 512జీబీ వేరియంట్ ధర రూ.1,49,900. వీటితో పాటు 1టీబీ వేరియంట్ కూడా ఉంది. ధర రూ.1,69,900. ఐఫోన్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంది. సియరా బ్లూ, సిల్వర్, గోల్డ్, గ్రాఫైట్ కలర్స్‌లో కొనొచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.9,000 నుంచి రూ.46,120 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. సెప్టెంబర్ 17న ప్రీ ఆర్డర్ మొదలవుతుంది. సెప్టెంబర్ 24న సేల్ మొదలవుతుంది.

ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్

ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 128జీబీ వేరియంట్ ధర రూ.1,29,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.1,39,900. ఇక 512జీబీ వేరియంట్ ధర రూ.1,59,900. వీటితో పాటు 1టీబీ వేరియంట్ కూడా ఉంది. ధర రూ.1,79,900. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంది. సియరా బ్లూ, సిల్వర్, గోల్డ్, గ్రాఫైట్ కలర్స్‌లో కొనొచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.9,000 నుంచి రూ.46,120 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. సెప్టెంబర్ 17న ప్రీ ఆర్డర్ మొదలవుతుంది. సెప్టెంబర్ 24న సేల్ మొదలవుతుంది.