Begin typing your search above and press return to search.
సైనికుడి ప్రాణాలు కాపాడిన ఐ ఫోన్: ఎక్కడంటే..?
By: Tupaki Desk | 19 July 2022 12:30 AM GMTమొబైల్ తో ఎన్ని లాభాలున్నా అది ఎన్నిటికైనా ప్రాణానికి ముప్పేనని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సార్లు మొబైల్ ఫోన్లు వాడుతుండగా ప్రాణాలు పోయిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. దీంతో చాలా మంది సెల్ ఫోన్ ను అవసరం మేరకే వాడుకోవాలని సూచిస్తున్నారు. కానీ ఓ మొబైల్ ఫోన్ ఓ సైనికుడిని రక్షిస్తుంది. దేశానికి సైనికుడు రక్షణనిస్తే అతనికి మాత్రం ఓ సెల్ ఫోన్ ప్రాణాలను కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ సెల్ ఫోన్ తో తన ప్రాణం ఎలా రక్షించబడిందో ఆ వీడియోలో సైనికుడు తెలిపాడు.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఇప్పట్ల ఆగడం లేదు. ఒకరి కంటే ఒకరు భీకర దాడులు చేస్తూ ముందుకు పోవడమే తప్ప యుద్ధం ముగించే దాఖలాలు కనిపించడం లేద. ఈ యుద్ధ కాలంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు.
యుద్ద సమయంలో అటు ఇరు దేశాలకు చెందిన ఎందరో సైనికులు ప్రాణ త్యాగం చేస్తున్నారు. అయితే రష్యా సైనికులే ఎక్కువగా మరణించారని ఉక్రెయిన్ చెబుతుండగా.. ఉక్రెయిన్ ను ఆధీనంలోకి తెచ్చుకుంటామని రష్యా ప్రకటనలు చేస్తోంది. అయితే తాజగా జరిగిన ఓ సంఘన నెట్టింట వైరల్ గా మారింది. ఓ సైనికుడి ప్రాణాన్ని ఓ మొబైల్ ప్రాణం కాపాడడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఉక్రెయిన్ పై ఇప్పటికీ రష్యా దాడి చేస్తూనే ఉంది. ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ చొచ్చుకుపోతుంది. ఈ క్రమంలో క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా జరిగిన దాడిలో ఓ సైనికుడిపై బుల్లెట్ దూసుకుపోయింది.
అయితే ఆ సమయంలో ఉక్రెయిన్ సైనికుడు తన ఐ ఫోన్ ను బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకున్నాడు. రష్యా విసిరిన బుల్లెట్ ఐ ఫోన్ కుతగలడంత అక్కడే ఆగిపోయింది. దీంతో ఆ బుల్లెట్ సైనికుడికి తగలకుండా ఐ ఫోన్ అడ్డుకుంది. ఒక వేళ తన జేబులో ఐఫోన్ లేకపోతే ఆ బుల్లెట్ సైనికుడిన శరీరంలోకి వెళ్లి మరణించే అవకాశం ఉంది అని ఆయన వీడియోలో చెప్పాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మారుమోగుతోంది. రిడ్డిక్ అనే సోషల్ మీడియా ఈ వీడియోను పోస్టు చేసింది. సైనికుడు తన బ్యాక్ ప్యాకెట్ నుంచి సెల్ ఫోన్ తీస్తూ చూపించాడు. ఆ ఫోన్ కు బుల్లెట్ పడిన డ్యామేజీ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇది బుల్లెట్ అని అందరూ అంటున్నారు. గత ఫిబ్రవరి నుంచి యుద్ధం మొదలు పెట్టిన రష్యా ఐదు నెలలుగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్లోని పలు కీలక ప్రాంతాలను ఆక్రమించుకుంది. శనివారం జరిగిన దాడుల్లో 16 మంది సైనికులు మృతి చెందారు.