Begin typing your search above and press return to search.

పృథ్వీషా.. చెమటలు పట్టించాడు.. మొదటి ఓవర్లనే చుక్కలు..!

By:  Tupaki Desk   |   30 April 2021 5:30 AM GMT
పృథ్వీషా.. చెమటలు పట్టించాడు.. మొదటి ఓవర్లనే చుక్కలు..!
X
నిన్న కోల్​కతా నైట్​ రైడర్స్​తో ఢిల్లీ క్యాపిటల్స్​ తలపడింది. మొదటి బ్యాటింగ్​ చేసిన కేకేఆర్​ నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. ఇక 155 పరుగుల లక్ష్యంతో రంగంలో దిగిన ఢిల్లీ .. మొదటి ఓవర్లోనే చుక్కలు చూపించింది. ఓపెనర్లుగా పృథ్వీ షా.. శిఖర్​ ధవన్​ వచ్చారు. తొలి ఓవర్​ ను శివమ్​ మావి వేశాడు. నిన్న చాలా పాజిటివ్​ మైండ్​తో పృథ్వీ వచ్చినట్టు ఉన్నాడు. మొదటి బాల్​ ను మావి వైడ్​గా వేశాడు. అనంతరం వేసిన ఆరు బంతులను పృథ్వీ బౌండరీలుగా మలిచాడు.

వివిధ యాంగిల్స్​ లో అతడు షాట్స్​ కొడుతుంటే కేకేఆర్​ ఫీల్డర్స్​ ప్రేక్షకులుగా చూస్తూ ఉండిపోయారు. పృథ్వీ పూనకం వచ్చిన వాడిలా రెచ్చిపోయాడు. మ్యాచ్​ లో వేసిన తొలి బంతిని బౌండరీ గా మలిస్తే సాధారణంగా ఓ బౌలర్​ అయినా కాస్త ఆత్మవిశ్వాసం కోల్పోతుంటారు. శివమ్​ మావి విషయంలోనే అదే జరిగింది. ఆ తర్వాత అతడు లూస్​ బాల్స్ వేశాడు. దీంతో పృథ్వీ షా .. తొలి ఓవర్​లోనే ఆరు బంతులను బౌండరీలుగా మలిచాడు.

దీంతో మొదటి ఓవర్​ అనంతరం ఢిల్లీ 25 పరుగులు సాధించింది. ( వైడ్​ బాల్ ​తో కలిపి) ఎవరైనా డెత్​ ఓవర్లలో, ఆఖరి ఓవర్లలో ఎక్కువ పరుగులు చేస్తుంటారు. కానీ పృథ్వీ షా అందుకు భిన్నంగా మొదటి ఓవర్​ లోనే రెచ్చిపోయి బౌండరీలు బాదడంతో కోల్ ​కతా టీం చిక్కుల్లో పడింది. పృథ్వీ ఆట తీరును ఢిల్లీ ఫ్యాన్స్​ ఫుల్​ ఎంజాయ్​ చేశారు. ఇక అతడికి తోడు శిఖర్​ ధవన్​ కూడా నెమ్మదిగా ఆడుతూ.. పృథ్వీకి స్ట్రైక్స్​ ఇస్తూ పోయాడు.

పృథ్వీ షా ఆటతీరును మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ టెండుల్కర్​ సైతం ఎంతో మెచ్చుకుంటూ ఉంటాడు. నిన్నటి మ్యాచ్​ లో సైతం పృథ్వీ షా సచిన్​ టెండుల్కర్​ను తలపించాడు. సచిన్​ మాదిరిగానే బ్యాటింగ్​ స్టయిల్​ తో అలరించాడు. ఈ మ్యాచ్​ లో ఓపెనర్లే గెలిపిస్తారని అంతా భావించారు. పృథ్వీ షా (18 బంతుల్లో 50) హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఢిల్లీ తరపున తక్కువ బంతుల్లో ఫిప్టీ సాధించిన ఘనత సాధించాడు. గతంలో పంత్‌ సైతం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మోరిస్‌ కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం.