Begin typing your search above and press return to search.
ఆర్సీబీ దుమ్ము లేపుతోంది..! ప్రస్తుతానికి టాప్‌లో..!
By: Tupaki Desk | 23 April 2021 4:30 PM GMTరాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ సారి ఎలాగైనా చాంపియన్ గా నిలవాలని ఉన్విళ్లూరుతున్నది. అందులో భాగంగా పక్కా వ్యూహంతో రంగంలోకి దిగింది. మ్యాక్స్‌వెల్, డివిలియర్స్ ఫామ్‌ను కొనసాగిస్తుండటం కూడా ఆ జట్టుకు కలిసి వస్తోంది. ఇక టీమిండియాకు నేతృత్వం వహించే .. విరాట్ కోహ్లీ ఆర్సీబీకి సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వరసగా ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్లో చాంపియన్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సారి మాత్రం ఆర్ సీ బీ మాంచి ఊపు మీద ఉన్నది.
నిన్నటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను మట్టికరిపించింది. దీంతో ప్రస్తుతం పాయింట్ టేబుల్స్ లో ఆర్సీబీ నంబర్ 1 స్థానంలో ఉంది.అయితే పాయింట్ టేబుల్‌ను ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క మ్యాచ్ తారుమారైనా లెక్క తప్పుతుంది. ఇదిలా ఉంటే ఆర్సీబీ బ్యాట్స్ మెన్లు ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసి వస్తుంది. విదేశీ క్రికెటర్లు మ్యాక్స్‌వెల్, డివిలియర్స్‌తో పాటు .. కెప్టెన్ విరాట్ కోహ్లీ , దేవదత్ పడిక్కల్ కూడా రాణిస్తున్నారు. దీంతో ఆ జట్టు సులువుగా విజయాలను నమోదు చేస్తున్నది.
పాయింట్ల పట్టికలో నంబర్ 1కు చేరుకోవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. సోషల్‌మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ సీజన్లో ఆర్సీబీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడగా.. నాలుగు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ నంబర్ 1 స్థానంలో ఉండగా.. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్, నాలుగో స్థానంలో ముంబై ఇండియన్స్ కొనసాగుతున్నాయి.
లీగ్ మ్యాచ్ లో మొదటి నాలుగు జట్లు మాత్రమే ప్లే ఆప్స్ కు వెళతాయన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదో స్థానంలో కొనసాగుతున్నది. ఇదే ట్రెండ్ కొనసాగితే.. ప్రస్తుతం ఉన్న నాలుగు జట్లే ప్లే ఆప్స్ కు వెళ్లే అవకాశం ఉంది. అంటే ఆర్సీబీ, సీఎస్కే, డీసీ, ఎంఐ ఈ నాలుగు జట్టే ప్లే ఆప్స్ కు వెళ్లే అవకాశం ఉంది. గత సీజన్ లో ప్లే ఆప్స్ కు చేరుకోలేకపోయిన ధోనీ సేన.. ఈ సారి మెరుగైన ప్రదర్శన ఇస్తోంది. సమష్టి కృషి ఆ జట్టును విజయతీరాలకు నడిపిస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మరింత మెరుగ్గా రాణిస్తే తప్ప.. ప్లే ఆప్స్‌కు చేరుకొనే అవకాశం లేదు. ఈ జట్లన్నీ బ్యాటింగ్ వైఫల్యంతోనే దెబ్బతింటున్నాయి. పంజాబ్ కింగ్స్ లో క్రిస్‌గేల్, నికోలస్ పూరన్ లాంటి ట్యాలెంటెడ్ బ్యాట్స్మెన్లు ఉన్నా.. ఆ జట్టుకు ఈ సారి వాళ్లు ఉపయోగపడటం లేదు. క్రిస్ గేల్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. ఇక నికోలస్ పూరన్ కూడా నిరాశ పరిచాడు. ఇవాళ పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.