Begin typing your search above and press return to search.

ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. MI vs CSK ఫస్ట్ మ్యాచ్

By:  Tupaki Desk   |   26 July 2021 4:43 AM GMT
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. MI vs CSK ఫస్ట్ మ్యాచ్
X
ఐపీఎల్ 2021 సీజన్‌ లో మిగిలిన మ్యాచ్‌ లు యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇండియా లో కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ పట్టుదలతో ఎలాగైనా కూడా ఐపీఎల్ 2021 ని పూర్తి చేయాలని మిగిలిన మ్యాచ్‌ లని యూఏఈ వేదిక నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఆ  మ్యాచ్‌ లకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. ఫస్ట్ మ్యాచ్‌ లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టబోతోంది.

ఈ మేరకు ఫ్రాంఛైజీలకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా మెయిల్ పంపినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ జట్లలో వరుసగా కరోనా కేసులు నమోదవడంతో ఐపీఎల్ 2021 సీజన్‌ ని మధ్యలో బీసీసీఐ నిలిపివేసింది. షెడ్యూల్ ప్రకారం మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. అప్పటికి 29 మ్యాచ్‌ లు మాత్రమే ముగిశాయి.

దీనితో  మిగిలిన 31 మ్యాచ్‌ లను యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే అధికారింగా బీసీసీఐ ప్రకటించింది. ఆ తర్వాత రెండు రోజులకే యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 వరల్డ్‌ కప్ ప్రారంభంకానుంది.

సెప్టెంబరు 19న ముంబయి, చెన్నై మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుండగా..  అక్టోబరు 8న లీగ్ స్టేజ్‌లో చివరి మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ను ఆర్సీబీ ఢీకొడుతుంది.  కేకేఆర్‌ తో ఆర్జీబీ సెప్టెంబర్ 20 న అబుదాబిలో తలపడనుంది. ఐపీఎల్ 2021 యొక్క రెండవ భాగంలో సెప్టెంబర్ 25 నుంచి రోజుకు రెండు మ్యాచులు ప్రారంభంకానున్నాయి. అబుదాబిలో మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.

రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్- పంజాబ్ కింగ్స్ షార్జాలో తలపడతాయి. అలాగే సెప్టెంబర్ 26 న చెన్నై సూపర్ కింగ్స్- కేకేఆర్ అబుదాబిలో.. ఆర్‌సీబీ- ముంబై దుబాయ్‌ లో ఆడడనున్నాయి. అన్ని జట్లు ఖచ్చితంగా మధ్యాహ్నం కనీసం ఒక మ్యాచ్లో తలపడనున్నాయి. ఢిల్లీ జట్టు మాత్రం మధ్యాహ్నం మూడు మ్యాచ్‌లు ఆడనుంది. అదే సమయంలో సీఎస్‌కే, ముంబై, కేకేఆర్, పంజాబ్‌లు మధ్యాహ్నం రెండు మ్యాచ్‌లు ఆడనున్నాయి. షార్జాలో అన్ని జట్లు రెండు మ్యాచ్‌లు ఆడనున్నాయి. సీఎస్‌కే, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హైదరాబాద్, ఆర్‌సీబీ దుబాయ్‌లో మూడు మ్యాచ్‌లు ఆడనుండగా, ముంబై, కేకేఆర్ మూడు మ్యాచ్‌లు అబుదాబిలో ఆడనున్నాయి. మేలో కరోనా కారణంగా టోర్నమెంట్ అర్థాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే.

క్వాలిఫయర్-1 మ్యాచ్ అక్టోబరు 10న, ఎలిమినేటర్ అక్టోబరు 11న, క్వాలిఫయర్-2 అక్టోబరు 13న, ఫైనల్ మ్యాచ్ అక్టోబరు 15న జరగనుంది. మొదటి క్వాలిఫైయర్-1 మ్యాచ్ అక్టోబరు 10న దుబాయ్‌ లో జరుగుతుంది. ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లు షార్జా వేదికగా అక్టోబరు 11, అక్టోబరు 13న నిర్వహిస్తారు.

మొత్తంగా దుబాయ్‌ లో 13, షార్జాలో 10, అబుదాబిలో 8 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 27 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో ఏడు డబుల్ హెడర్ మ్యాచ్‌ లు ఉండబోతున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3.30 గంటలకి.. రాత్రి మ్యాచ్‌లు 7.30కి స్టార్ట్ అవుతాయి. మొత్తం 31 మ్యాచ్‌ లు జరగనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ టాప్‌లో ఉంది. 12 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. చెన్నై, బెంగళూరు, ముంబై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.