Begin typing your search above and press return to search.
డకౌట్ అయ్యాడంటే.. ఆ మరుసటి ఇన్సింగ్స్ చెలరేగుతాడు.. !
By: Tupaki Desk | 12 April 2021 5:33 AM GMTనిన్నటి మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది. తొలి మ్యాచ్ లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి సత్తా చాటింది. బౌలింగ్‌లో కాస్త రాణించినా.. బ్యాటింగ్ వైఫల్యంతో సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే ఈ నిన్నటి ఇన్సింగ్స్ లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ నితీశ్ రాణా హీరోగా నిలిచాడు. 80 పరుగులు సాధించి ప్రత్యర్థులకు చెమటలు పట్టంచాడు. 9 ఫోర్లు, 4 సిక్సులతో చెలరేగి పోయాడు.
కరోనా కారణంగా గత ఏడాది జట్టుకు దూరమైన నితీశ్ ఈ సారి తన రేంజ్ నిరూపించుకున్నాడు. రాణాకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నితీశ్ రాణా ఆటతీరుపై సోషల్ మీడియాలో ఓ ట్రోల్ నడుస్తున్నది. రాణా ఒక్కసారి గోల్డెన్ డకౌట్ అయ్యాక.. ఆ తర్వాత మ్యాచ్‌లో 80 పరుగులు అంతకు మించి పరుగులు తీస్తున్నాడు. ఇలా రాణాకు వరసగా నాలుగు సార్లు జరిగింది.
ఐపీఎల్ లో రానా చివరి ఇన్సింగ్స్ లు ఇలా సాగాయి. 0, 81, 0, 87, 0, 80 పరుగులు చేశాడు. ఒక్కసారి డకౌట్ అయ్యాడంటే ఆ మరుసటి మ్యాచ్ లో 80 అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తున్నాడు. అంటే రాణా చెలరేగాలంటే ఓ సారి డకౌట్ కావాల్సిందేనన్నమాట. నిన్నటి మ్యాచ్ లో రాణా ఆటతీరును చూసి ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. అసలు మైదానంలో ఏ వైపును వదలకుండా పరుగుల వరదను పారించాడు. కవర్ డ్రైవ్ షాట్లు, కట్ షాట్లు, లాఫైడ్ షాట్లు ఆడి తన సత్తా ఏమిటో చాటుకున్నాడు.
రాణా ఆటతీరును చూసి కోల్‌కతా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. క్రికెట్ అభిమానులంతా పండగ చేసుకున్నారు. లక్ష్య ఛేదనలో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. ప్రారంభంలోనే ఓపెనర్ గిల్ (15) విఫలమయ్యాడు. ఆ తర్వాత రాణా, త్రిపాఠి (53; 29 బంతుల్లో 5x4, 2x6) అర్ధ శతకాలతో దుమ్ములేపారు.
శాపమైన బ్యాటింగ్ వైఫల్యం..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ ను తరచూ దెబ్బతీసే బ్యాటింగ్ వైఫల్యమే ఈ సారి దెబ్బ కొట్టింది. డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా చెలరేగి ఆడితే విజయం చాలా తేలిక అని ఫ్యాన్స్ భావించారు. కానీ డేవిడ్ వార్నర్ (3), వృద్ధిమాన్ సాహా (7) పరుగులకు అవుట్ కావడంతో ఫ్యాన్స్ ఆశలు ఆవిరయ్యాయి. మనీశ్ పాండే (61; 44 బంతుల్లో 2x4, 3x6), జానీ బెయిర్‌స్టో (55; 40 బంతుల్లో 5x4, 3x6) రాణించినప్పటికీ హైదరాబాద్ విజయం సాధించలేకపోయింది.