Begin typing your search above and press return to search.

IPL 2022 వేలం: టాప్ 5 ఖరీదైన ఆటగాళ్ళు వీరే

By:  Tupaki Desk   |   13 Feb 2022 5:30 AM GMT
IPL 2022 వేలం: టాప్ 5 ఖరీదైన ఆటగాళ్ళు వీరే
X
ఐపీఎల్ 2022 మెగా వేలం నిన్న అంతరాయాల మధ్య తొలిరోజు ముగిసింది. వేలం పాడే వ్యక్తికి సడెన్ గా కళ్లు తిరిగి పడిపోవడంతో భారత వ్యాఖ్యాత చారు శర్మ ఆ బాధ్యత తీసుకున్నారు. మధ్యాహ్నం 3.45కి తిరిగి వేలం ప్రారంభమైంది. ఈ ఏడాది భారత్‌లో అతిపెద్ద క్రికెట్ సీజన్ ఐపీఎల్ కోసం పూర్తిస్థాయి వేలం జరుగనుంది.

గత సంవత్సరం సగం సీజన్ భారతదేశంలో జరిగింది.. మిగిలిన సగం సీజన్ యూఏఈలో జరిగింది. ప్రేక్షకుల హాజరు లేకుండానే ఈ ఏడాది ఐపీఎల్‌ భారత్‌లో జరుగుతుందని బీసీసీఐ ధృవీకరించింది. ఇదిలా ఉండగా తొలి వేలం పాటలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి.

10 ఫ్రాంచైజీల ముందు ఆటగాళ్లకు వేలం నిర్వహించారు. రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్యాట్ కమిన్స్, క్వింటన్ డి కాక్, శిఖర్ ధావన్, ఫాఫ్ డు ప్లెసిస్, శ్రేయాస్ అయ్యర్, కగిసో రబడ, మహ్మద్ షమీ, డేవిడ్ వార్నర్ వంటి స్టార్ ఆటగాళ్లు వేలంలో ఉన్నారు.

మొత్తం పది మంది ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ ను 15 కోట్లకు పైగా వెచ్చించి ముంబై కొనుగోలు చేసింది.వేలంలో ఇదే అత్యధిక మొత్తం కావడం గమనార్హం. అనంతరం శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 12.25 కోట్ల రూపాయలకు పట్టుకుంది. రవిచంద్రన్ అశ్విన్ 5 కోట్ల రూపాయలకు తీసుకున్నాడు. డేవిడ్ వార్నర్ ఢిల్లీకి 6 కోట్లకే అమ్ముడు పోవడం షాకింగ్ గా మారింది.

IPL 2022 వేలం రెండోరోజు నిర్వహించబడింది. కొన్ని ఆశ్చర్యకరమైన పిక్స్ -బిడ్‌లు ఉన్నాయి. 15.25 కోట్ల రూపాయలకు ముంబై ఇండియన్స్‌కు విక్రయించబడిన ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

ఈ సంవత్సరం, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రెండు కొత్త జట్లు గుజరాత్, లక్నో చోటు చేసుకోనున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో మొత్తం పది జట్లు తలపడనున్నాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ పట్టుకుంది. ఇక జానీ బెయిర్ స్టోను సన్ రైజర్స్ వదులుకొంది. పంజాబ్ కొన్నది. ఇక సన్ రైజర్స్ రెండో వేలంలో 12 కోట్లకు పైగా వెచ్చించి వాషింగ్టన్ సుందర్ ను దక్కించుకుంది. ఆ తర్వాత నికోలస్ పూరన్ కు 10 కోట్లకు పైగానే వెచ్చింది. దేశీయ ప్లేయర్లు భువనేశ్వర్, నటరాజన్ ను కొనుగోలు చేసింది.

ఈ ఏడాది వేలం పాటల్లో అత్యంత ఖరీదైన టాప్ 5 ప్లేయర్‌లను ఇక్కడ చూడండి.

-ఇషాన్ కిషన్ - రూ 15.25 కోట్లు - ముంబై
-దీపక్ చాహర్ - రూ 14 కోట్లు - చెన్నై
-శ్రేయాస్ అయ్యర్ - రూ 12.25 కోట్లు - కోల్‌కతా
-శార్దూల్ ఠాకూర్ - రూ 10.75 కోట్లు - ఢిల్లీ
-హర్షల్ పటేల్ – రూ 10.75 కోట్లు – RCB

ఐపీఎల్ వేలం మొదటి రోజు నిన్న ముగియగా, ఈరోజు రెండో రౌండ్ వేలం కొనసాగుతోంది.