Begin typing your search above and press return to search.
కరన్ రూ.18.50 కో్ట్లు, గ్రీన్ రూ.17.50 కోట్లు, స్టోక్స్ రూ.16.25 కోట్లు.. ఐపీఎల్ వేలంలో ధరల రికార్డు
By: Tupaki Desk | 23 Dec 2022 11:34 AM GMTవచ్చే సీజన్ (2023)కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం కేరళలోని కొచ్చిలో జరుగుతోంది. ఇందులో విదేశీ క్రికెటర్లు రికార్డు ధర పలికారు. అందరికంటే మించి ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ రూ.18.50 కోట్లు పలికాడు. లీగ్ లో ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర. గత ఏడాది దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ ను రూ.16.25 కోట్లకు అమ్ముడయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ ధర వెచ్చించింది. ఇప్పుడు దానిని మించి ముగ్గురు ఆటగాళ్లకు ధర దక్కడం విశేషం. కరన్ రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ పరమయ్యాడు. అయితే, ఆ తర్వాతి 2, 3 స్థానాలకు కూడా గతేడాది రికార్డు ధర కంటే అధిక మొత్తమే చెల్లించడం గమనార్హం. నంబర్ వన్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ (ఇంగ్లండ్)ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు పాడుకుంది. లక్‌నవూ, హైదరాబాద్ పోటీ పడినా చెన్నై భారీ ధర పెట్టింది. ఆస్ట్రేలియా వర్ధమాన ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ను రూ.17.50 కోట్లతో ముంబై ఇండియన్స్ పాడుకుంది. ఇది రెండో అత్యధిక ధర. ఢిల్లీతో పోటీ పడి మరీ ముంబై అతడిని కొనుగోలు చేసింది. కాగా విండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 5.75 కోట్లకు తీసుకుంది.
హైదరాబాద్ కు బ్రూక్ బూస్ట్ వార్నర్, ధావన్, ఆఖరికి విలియమ్సన్ నూ వదులుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి మినీ వేలంలో కాస్త తెలివిని ప్రదర్శించింది. ఇటీవలి పాకిస్థాన్ పర్యటనలో మూడు టెస్టుల్లోనూ సెంచరీలు కొట్టిన ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ హ్యారీ బ్రూక్ ను రూ. 13.25 కోట్లకు హైదరాబాద్ సొంతం చేసుకుంది.
అతడి కోసం రాజస్థాన్, బెంగళూరుతో పోటీ పడి మరీ దక్కించుకొంది. టెస్టులే కాదు.. బ్రూక్ టి20ల్లోనూ విధ్వంసంగా రేపగలడు. కాబట్టి ధర కాస్త ఎక్కువే అయినా ఏం కాదు. మరోవైపు మిగతా ఫ్రాంచైజీలు వదిలేసిన ఆటగాళ్ల కొనుగోలుకు పది ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. కేన్ విలియమ్సన్ (రూ. 2 కోట్లు)ను గుజరాత్, మయాంక్ అగర్వాల్ (రూ.8.25 కోట్లు)ను హైదరాబాద్,అజింక్యా రహానె (రూ. 50 లక్షలు)ను చెన్నై దక్కించుకున్నాయి. విలియమ్సన్‌ను గుజరాత్ రూ. 2 కోట్ల కనీస ధరతో సొంతం చేసుకొంది.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్,రిలీ రోసో అన్‌సోల్డ్ అవడం గమనార్హం. పంజాబ్ మాజీ కెప్టెన్ అయిన మయాంక్ అగర్వాల్‌ను హైదరాబాద్ రూ. 8.25 కోట్లకు సొంతం చేసుకొంది. పంజాబ్, బెంగళూరు జట్లు పోటీ పడగా.. చివరికి రంగంలోకి దిగిన హైదరాబాద్ దక్కించుకుందిత.
వీరికెంత ఇస్తారో?ఈ మినీ వేలంలో కొందరు కుర్రాళ్లకు జాక్ పాట్ తగిలే అవకాశం ఉంది. ఇంకా అరంగేట్రం చేయని వీరంతా దేశీ ఆటగాళ్లే. భారీ సిక్స్‌లు కొట్టగల పంజాబ్ ఆల్‌రౌండర్ సన్వీర్ సింగ్, విజయ్ హజారె ట్రోఫీలో వరుసగా అయిదు శతకాలతో రికార్డు సృష్టించిన తమిళనాడు వికెట్‌కీపర్ బ్యాటర్ జగదీశన్‌లకు కూడా మంచి ధర పలకొచ్చు. విదర్భ పేసర్
యశ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ ఎడమచేతి వాటం ఫినిషర్ ఆకాశ్ వశిష్ఠ్‌లూ వేలంలో జట్లను ఆకర్షించవచ్చు. ఆకాశ్ ఉపయుక్తమైన స్పిన్నర్ కూడా. జమ్ము కశ్మీర్ యువ పేసర్లు షారుఖ్ దర్, ముజ్తబా యూసుఫ్ వేలంలో ఉన్నారు. అఫ్గానిస్థాన్‌కు చెందిన 15 ఏళ్ల మిస్టరీ స్పిన్నర్ అలా మహ్మద్ ఘజాన్‌ఫార్ ఈ భారత టీ20 లీగ్ వేలంలో ఉన్న అతి చిన్న వయసు ఆటగాడు. అఫ్గాన్ దేశవాళీ క్రికెట్లో మూడు టీ20 మ్యాచ్‌లే ఆడినప్పటికీ తన ప్రతిభతో అందరినీ ఆకర్షించిన ఈ కుర్రాడు.. భారత టీ20 లీగ్ వేలం తుది జాబితాలో చోటు సంపాదించాడు. ఇక భారత మాజీ లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా 40 ఏళ్ల వయసులో వేలంలో అతి పెద్ద వయస్కుడిగా ఉన్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.