Begin typing your search above and press return to search.

ఐపీఎల్ వేలం: ఎవరి బలమెంత?

By:  Tupaki Desk   |   21 Dec 2019 10:03 AM GMT
ఐపీఎల్ వేలం: ఎవరి బలమెంత?
X
ఐపీఎల్ వేలం ముగిసింది. మరి ఎవరికి ఏ ఆటగాడు దొరికాడు. ఎవరి బలం పెరిగింది. ఎవరి బలం తగ్గింది. మెరుగైన ఆటగాళ్లు ఎవరికి దక్కారు? అనే దానిపై ఆసక్తి నెలకొంది.

మొత్తం 62 మంది ఆటగాళ్లను ఐపీఎల్ -13 వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఈ వేలంలో స్వదేశీ క్రికెటర్లు ఎక్కువ ధర పలికారు. విదేశీ ఆటగాళ్ల పంట పండింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ల వైపు ప్రాంచైజీలు మొగ్గుచూపాయి.

ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ అత్యధికంగా 15.50 కోట్లకు కోల్ కతాకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. మరో ఆస్ట్రేలియన్ మాక్స్ వెల్ కు రెండో అత్యధిక ధర లభించింది. విండీస్ ఆటగాళ్లు హెట్ మెయిర్, బౌలర్ షెల్డన్ కాట్రెల్ లకు లక్కీచాన్స్ తగిలి భారీ ధరకు అమ్ముడుపోయారు.

వేలంలో భారత క్రికెటర్లకు చుక్కెదురైంది. యూసుఫ్ పఠాన్, పూజారా, సువర్ట్ బిన్నీ, హనుమ విహారీ, మనోజ్ తివారీ, ఓజా, శరణ్, మోహిత్ శర్మ, కరియప్పలు అమ్ముడుపోలేదు. విదేశీ ఆటగాళ్లలో గప్టిల్, లూయిస్, ముస్తాఫిజుర్ , హోల్డర్, కటింగ్, జంపా, ప్లంకెట్, బ్రాత్ వైట్ లను పట్టించుకోలేదు.

జట్ల పరంగా చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలో పెద్ద ఆటగాళ్లను కొనలేదు. స్వదేశీ స్టార్లపై కన్నేసి పాత వారిపైనే ఆధారపడింది. ఢిల్లీ మెరుగైన హెట్ మెయిర్, క్యారీ, వోక్స్ , స్టాయినిస్ లను కొని చాలా పటిష్టంగా తయారైంది. కోల్ కతా కమిన్స్ ను 15 కోట్లకు ఇతర మోర్గాన్, తాంబే, క్రిస్ గ్రీన్, బాంటన్ ల పై భారీగా డబ్బులు వెదజల్లి కొని బలం పెంచుకుంది. బెంగళూరు కూడా ఫించన్, స్టెయిన్, మోరిస్ లపై డబ్బులు వెదజల్లి స్ట్రాంగ్ తయారైంది. చెన్నై, ముంబై, రాజస్థాన్ పరిమితంగానే వేలంలో పాల్గొని స్వదేశీ తక్కువ ధర గల ఆటగాళ్లను తీసుకున్నాయి. పంజాబ్ మాక్స్ వెల్, నీషబ్, జోర్డాన్, కాట్రెల్ లను తీసుకొని బలోపేతం అయ్యింది.

మొత్తంగా ఈ ఐపీఎల్ వేలంలో బలహీన జట్లు భారీగా ధరలు పెట్టి కొని బలపడగా.. బలమైన జట్లు స్వదేశీ ఆటగాళ్లను కొని ఊరుకున్నాయి.