Begin typing your search above and press return to search.
వామ్మో.. ఐపీఎల్ బెట్టింగ్ ఈ రేంజ్ లోనా!
By: Tupaki Desk | 4 April 2019 7:34 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లపై బెట్టింగులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థమయ్యేలా చేసే ఉదంతం ఇది. రాజస్తాన్ లోని కోట నగరం లో పట్టుబడిన ఒక బెట్టింగ్ ముఠా విషయంలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం ఏడు మంది గ్యాంగ్ పట్టు పడింది అక్కడ. ఆ ముఠా ఈ మధ్య కాలంలో నడిపించిన బెట్టింగ్ దందా అక్షరాలా ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అంటే ఆశ్చర్యం కలగకమానదు!
ఒక మోస్తరు నగరం అయిన కోట లో పట్టుబడిన ఒక బెట్టింగ్ గ్యాంగ్ ఈ రేంజ్లో బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహించింది అంటే.. ఇక దేశ వ్యాప్తంగా ఏ రేంజ్ లో బెట్టింగ్ నడుస్తూ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక నగరంలో పట్టుబడిన బెట్టింగ్ ముఠా వద్దే ఈ రేంజ్ లో లావాదేవీలు జరిగాయనే విషయం వెలుగులోకి వచ్చింది. కోట లాంటి సాధారణ నగరంలోనే ఈ రేంజ్లో బెట్టింగ్ డబ్బులు చేతులు మారుతూ ఉన్నాయంటే… బెట్టింగ్ మత్తు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రత్యేకించి యువతరం ఐపీఎల్ వేళ బెట్టింగ్ మత్తులో మునిగి తేలుతూ ఉంది. ఓవర్ ఓవర్ కూ బెట్టింగులు - మ్యాచ్ ల ఫలితాలపై - క్రికెటర్ల స్కోర్లు.. ఇలా రకరకాల అంశాలపై బెట్టింగులు సాగుతూ ఉన్నాయి. ఇది వేల కోట్ల రూపాయల పందేరంగా మారింది. అందుకే ఒక చోటా నగరంలోనే బెట్టింగ్ మాఫియా ఈ రేంజ్లోకి పడగలెత్తింది. ఇక దేశ వ్యాప్తంగా దీని విస్తృతి ఏ రేంజ్లో ఉంటుందో!