Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్స్.. చిక్కిన బుకీలు
By: Tupaki Desk | 11 Oct 2020 4:30 PM GMTఐపీఎల్ యమ రంజుగా సాగుతోంది. కరోనా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమై ఎంటర్ టైన్ మెంట్ కు నోచుకోని జనాలకు ఐపీఎల్ మంచి వినోదాన్ని పంచుతోంది. దీంతోపాటే ఐపీఎల్ బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి. పల్లె, పట్నంలలో బెట్టింగ్ లు కాస్తున్నారు. తాజాగా పలు జిల్లాల్లో బెట్టింగ్ బ్యాచ్ లు పోలీసులకు చిక్కడం కలకలం రేపుతోంది.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. పెద్ద ఎత్తున బెట్టింగ్ లకు పాల్పడుతున్న నలుగురు బుకీలను, 14మంది బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6 లక్షల 45వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 17 మొబైల్ ఫోన్లు, ఒక టీవీ, ఇతర సామగ్రిని నూజివీడు పోలీసులు సీజ్ చేశారు. బుకీలు, బెట్టింగ్ రాయుళ్లను మీడియాకు ఎస్పీ రవీంద్ర నాథ్ లు చూపించారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఐపీఎల్ బెట్టింగ్ దర్జాగా సాగుతోంది. పోలీసుల దాడిలో ఆరుగురు యువకులు పట్టుబడ్డారు. ఒకరు పరార్ కాగా.. ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి ఐదు సెల్ ఫోన్లు, 87 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇక మహానగరం హైదరాబాద్ లోనూ ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కుల్బుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరి నుంచి సెల్ ఫోన్లు, లక్షా 20వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.