Begin typing your search above and press return to search.
ఐపీఎల్ కి అవకాశం ఇవ్వండి .. కేంద్రానికి బీసీసీఐ లేఖ
By: Tupaki Desk | 21 July 2020 3:30 PM GMTఐపీఎల్ .. ఇండియన్ ప్రీమియర్ లీగ్. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన లీగ్. అలాగే , అత్యంత ప్రజాధారణ ఉన్న లీగ్ కూడా ఇదే కావడం విశేషం. ఈ ఐపీఎల్ కి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది అభిమానులు ఉన్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఐపీఎల్ 2020 ఇప్పటికే ముగిసిపోయేది. కానీ , కరోనా విజృంభణతో ఐపీఎల్ ను బీసీసీఐ వాయిదా వేసింది. అయితే , ఒక్క ఏడాది ఐపీఎల్ నిర్వహించలేకపోతే దాదాపుగా 4వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన క్రికెట్ పెద్దలు ..ఎలాగైనా ఈ ఐపీఎల్ ను నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు.
తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన 2020 టీ20 ప్రపంచకప్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేసి ప్రకటన విడుదల చేసింది. దీనితో ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రణాళికలను వేగవంతం చేసింది. టీ20 ప్రపంచకప్ రద్దు అయితే.. ఆ గ్యాప్ లో ఐపీఎల్‌ను నిర్వహించి తీరుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి ఇప్పటికే పలు మార్లు చెప్పారు. దానికి తగ్గట్లే సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈ లో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న కారణంగా ఇండియా లో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించడానికి సాధ్యం కాదని, యూఏఈ లో మ్యాచులు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘ దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున్న ఐపీఎల్ ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించామని, సెప్టెంబర్-నవంబర్ మధ్యలో లీగ్ ను యూఏఈ లో నిర్వహించేందుకు షెడ్యూల్ ను రూపొందించామని, యూఏఈ లో మ్యాచ్ ల నిర్వహణకు భారత ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని కోరుతుతున్నాం’ అని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పొందుపరిచారు. ఇక ఇప్పుడు కేంద్రం తీసుకునే నిర్ణయం పై ఐపీఎల్ 2020 భవితవ్యం ఆధారపడి ఉంది. కాగా , దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా 2014లో తొలిసారి యూఏఈలో ఐపీఎల్-7ను నిర్వహించిన విషయం తెలిసిందే