Begin typing your search above and press return to search.

కరోనాపై ఐపీఎల్ పాట.. కాపీ అంట.?

By:  Tupaki Desk   |   9 Sep 2020 2:30 AM GMT
కరోనాపై ఐపీఎల్ పాట.. కాపీ అంట.?
X
కరోనా కష్టకాలంలోనూ దేశంలోని క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచాలని ఐపీఎల్ ను గల్ఫ్ దేశమైన యూఏఈలో నిర్వహిస్తున్నారు. అయినా అక్కడ కూడా ఆటగాళ్లను కరోనా వీడడం లేదు. చెన్నై జట్టులో 13మంది కరోనా బారిన పడి ఆ టీం మనోధైర్యం దెబ్బతింది.

కరోనాను తట్టుకొని ఆటగాళ్లు ముందుకు రావడంతో బీసీసీఐ వారిలో స్ఫూర్తి నింపేందుకు తాజాగా ముందడుగు వేసింది. కరోనాపై యుద్ధం చేస్తున్నామనే అర్థం వచ్చేలా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసంను నింపేలా ఓ అద్భుతమైన పాటను చిత్రీకరించారు.

తాజాగా బీసీసీఐ ఐపీఎల్ పై విడుదల చేసిన పాట దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ‘ఆయేంగే హమ్ వాపస్’ అనే లిరిక్స్ తో సాగిన ఈ పాట ఆసాంతం అభిమానుల రోమాలు నిక్కబొడిచేలా రూపొందడం విశేషం.

అయితే ఐపీఎల్ రిలీజ్ చేసిన ఈ పాట కాపీ అని.. తన పాటను నిర్వాహకులు కాపీ కొట్టారని ర్యాపర్ కృష్ణ ఆరోపించాడు. ‘దేఖ్ కౌన్ ఆయా వాపస్’ అనే పాటను ‘ఆయేంగే హమ్ వాపస్’ అని మార్చి ఐపీఎల్ ఆంథమ్ సాంగ్ గా విడుదల చేశారని ట్వీట్ చేశాడు.

నా అనుమతి లేకుండా నా పాటను ఐపీఎల్ నిర్వాహకులు దోపిడీ చేశారని.. నా సహచరులు, స్నేహితులు ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసి అందరికీ చేరేలా చేయాలని తెలిపారు. ఈ విషయం నుంచి వాళ్లు తప్పించుకోలేరు అని తెలిపాడు. దీంతో ఐపీఎల్ పాట కాపీనా అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో సాగుతోంది.

ఐపీఎల్ పాట..