Begin typing your search above and press return to search.

వీళ్లకు ఇప్పుడు వెలిగిందా? ‘కరోనా’కు ఐపీఎల్​ ప్రాంచైజీల సాయం..!

By:  Tupaki Desk   |   30 April 2021 2:30 PM GMT
వీళ్లకు ఇప్పుడు వెలిగిందా?  ‘కరోనా’కు ఐపీఎల్​ ప్రాంచైజీల సాయం..!
X
దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. బెడ్లు దొరకక, ఆక్సిజన్​ అందక కోవిడ్​ రోగులు ప్రాణాలు వదులుతున్నారు. ఇక శ్మశానాల్లో శవాల క్యూలైన్లో కనిపిస్తున్నాయి. భారత దేశ దుస్థితికి అంతర్జాతీయ సమాజం జాలిపడుతోంది. ఇదిలా ఉంటే మనదేశంలో ఐపీఎల్​ కొనసాగుతోంది. ఓ వైపు కరోనాతో ప్రజలు చస్తుంటే ...ఇప్పుడు ఈ గేమ్​ అవసరమా? అన్న చర్చ కూడా నడుస్తోంది. ప్రభుత్వ రాయితీలతో లబ్ధిపొందే పారిశ్రామిక వేత్తలు సైతం కరోనా విపత్తువేళ సాయం ప్రకటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

విదేశీ క్రికెటర్లు భారీగా విరాళం ప్రకటించారు. పాట్ కమ్మిన్స్, బ్రెట్ లీ ఇప్పటికే భారత్​ కు సాయం ప్రకటించారు. దీంతో స్వదేశీ క్రికెటర్లు విరాళం ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా సచిన్​ టెండూల్కర్ కూడా కరోనాకు సాయం ప్రకటించాడు. ఆక్సిజన్​ సిలిండర్ల కొనుగోలుకు విరాళం ఇస్తున్నట్టు సచిన్​ పేర్కొన్నాడు. రాజస్థాన్​ రాయల్స్​, ఢిల్లీ క్యాపిటల్స్​ ప్రాంచైజీలు కూడా కరోనా కు సాయం ప్రకటించాయి. రాజస్థాన్​ రాయల్స్​ 1 మిలియన్ (రూ. 7.5 కోట్లు) విరాళం గా ఇచ్చింది. ఈ మేరకు ఓ రాజస్థాన్​ రాయల్స్​ ఈ ట్వీట్​ చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ సైతం రూ. 1.5 కోట్లు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించింది. దేశం లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఐపీఎల్​ నిర్వహించడం అవసరమా? అంటూ అంతర్జాతీయ మీడియా వరస కథనాలు ప్రచురిస్తున్నది. అయితే బీసీసీఐ మాత్రం ఐపీఎల్​ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఐపీఎల్​ నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. మరోవైపు వెంటనే భారత్​ ను విడిచి రావాలంటూ విదేశీ క్రికెటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఐపీఎల్​ లో వెస్టిండీస్​, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​ కు చెందిన విదేశీ క్రికెటర్లు ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే వారిని క్షేమంగా ఇళ్లకు చేర్చుతామని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.

మరోవైపు కొన్ని దేశాలు భారత్​తో తాత్కాలికంగా రాకపోకల్ని నిలిపివేశాయి. దీంతో ఆయా దేశాల క్రికెటర్ల లో ఆందోళన నెలకొన్నది. మరోవైపు కరోనాకు భారతీయ క్రికెటర్లు సాయం చేయకపోవడం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు ఆక్సిజన్​ సిలిండర్లు దొరకక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటూ.. రూ. వేల కోట్లు ఖర్చుపెట్టి ఐపీఎల్​ నిర్వహించడం అవసరమా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.