Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ నుంచి ఐపీఎల్.. యూఈఏలో కొనసాగింపు

By:  Tupaki Desk   |   25 May 2021 3:35 PM GMT
సెప్టెంబర్ నుంచి ఐపీఎల్.. యూఈఏలో కొనసాగింపు
X
కరోనా కల్లోలంతో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 పై బీసీసీఐ శుభవార్త చెప్పింది. క్రికెట్ ప్రేమికులకు ఊరటనిస్తూ సెప్టెంబర్ 19 నుంచి ఆగిపోయిన ఐపీఎల్ ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లోనే జరుగుతాయని తెలిపింది.

ఐపీఎల్ ఈసారి ఇండియాలో నిర్వహించారు. అయితే ఆటగాళ్లు అంతా ఒక్కరొక్కరుగా కరోనా బారిన పడడంతో మధ్యలోనే బీసీసీఐ నిరవధికంగా ఐపీఎల్ ను వాయిదా వేసింది. దీంతో విదేశీ ఆటగాళ్లు అంతా వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు.ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ దృష్ట్యా ఐపీఎల్ ను భారత్ లో నిర్వహించడం సాధ్యం కాదని బీసీసీఐ సంకేతాలు ఇచ్చింది. దీంతో ఆయా బోర్డులు ఐపీఎల్ నిర్వహించేందుకు ముందుకు వచ్చాయి.

వీటన్నింటిని పరిశీలించిన తర్వాత గత ఐపీఎల్ ను పకడ్బందీగా నిర్వహించిన యూఏఈకే బీసీసీఐ మరోసారి అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు యూఏఈ వేదికగా మిగిలిన ఐపీఎల్ సీజన్ ను పూర్తి చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. దీనికోసమే ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ను ముందుగా పూర్తి చేయాలని బీసీసీఐ తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును కోరింది. మే 29న దీనిపై ఐపీఎల్ ప్రత్యేక మీటింగ్ నిర్వహించి ప్రకటించనున్నారు.