Begin typing your search above and press return to search.

ఖేలో ఐపీఎల్.. నిర్వహణకు రంగం సిద్ధం.!

By:  Tupaki Desk   |   7 July 2020 11:45 AM GMT
ఖేలో ఐపీఎల్.. నిర్వహణకు రంగం సిద్ధం.!
X
కరోనా లాక్ డౌన్ తో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. మూడు నెలలుగా పనీ పాట లేకుండా చాలా మంది విసిగి వేసారుతున్నారు. వర్క్ ఫ్రం హోంతో కొందరు ఉద్యోగాలు వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో కేసులు జెట్ స్పీడులా పెరుగుతున్నాయి. అవి ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక కేసుల్లో మూడో స్థానానికి చేరుకున్నాం. దీంతో దేశంలో క్రీడల నిర్వహణ అసాధ్యం. ఆడే పరిస్థితులు మచ్చుకైనా లేవు.

అన్నీ బంద్ అయిపోయిన వేళ తాజాగా ప్రపంచంలోనే ఖరీదైన లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ వార్త క్రికెట్ అభిమానులకు ఊరట పంచింది. ఎందుకంటే ఇప్పటికే ఇంటికే పరిమితమైన చాలా మందికి ఐపీఎల్ తో కాస్త ఊరట చెందొచ్చు.

తాజాగా విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ రెడీ అవుతోంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటించారు. ఈ ఏడాది విదేశాల్లో ఐపీఎల్ జరుగుతుందని తెలిపారు. మరోసారి ఐపీఎల్ విదేశాల్లో జరుగుతుందని తెలిపారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలానే ఐపీఎల్ దేశంలో సాధ్యం కాక దక్షిణాఫ్రికాలో నిర్వహించారు.

కాగా ఐపీఎల్ నిర్వహణకు ఇప్పటికే శ్రీలంక, యూఏఈ, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు సిద్ధమని ప్రకటించాయి. న్యూజిలాండ్ కరోనా ఫ్రీ దేశంగా మారింది. కానీ అక్కడికి మన సమాయానికి భారీగా తేడా ఉందని.. అక్కడ రాత్రి మ్యాచ్ జరిగితే మనకు ఉదయం పూట ప్రత్యక్షప్రసారం అవుతుంది. దీంతో రేటింగ్ పరంగా దెబ్బపడుతుందని బీసీసీఐ ఆలోచిస్తోంది. యూఏఈలో నిర్వహణకు అనుకూలం అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.