Begin typing your search above and press return to search.
ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. ధనాధన్ టోర్నీ అప్పట్నుంచే!
By: Tupaki Desk | 7 March 2021 12:56 PM GMTఐపీఎల్ క్రికెట్ పండుగకు ముహూర్తం ఖరారైంది. 14వ సీజన్ షెడ్యూల్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ బాడీ రిలీజ్ చేసింది. కొవిడ్ నేపథ్యంలో కేవలం మూడు మైదానాల్లోనే మొత్తం మ్యాచ్ లు నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఆ మొత్తాన్ని డబుల్ చేసింది. ఆరు గ్రౌండ్లలో మ్యాచ్ లు నిర్వహించాలని నిర్ణయించింది. కానీ.. అందులో హైదరాబాద్ కు మాత్రం చోటివ్వలేదు బీసీసీఐ.
ఇక, ఈ సీజన్ తొలి మ్యాచ్ ఏప్రిల్ 9న ప్రారంభం కాబోతోంది. చెన్నైలో జరగనున్న మొదటి మ్యాచ్ లో చాంపియన్ ముంబైతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఢీకొనబోతోంది. మొత్తం 56 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, 10 మ్యాచ్ లకు అతిథ్యం ఇవ్వనున్నాయి. మిగిలిన అహ్మదాబాద్, ఢిల్లీ నగరాల్లో 8 మ్యాచ్ ల చొప్పున నిర్వహించనున్నారు. మే 30న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
కాగా.. కొన్ని గ్రౌండ్లలోనే మ్యాచ్ లు నిర్వహించడంపై మిగిలిన ప్రాంఛైజీలు అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. దీంతో.. ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగొంది ఐపీఎల్ బాడీ. ఏ జట్టు కూడా హోం గ్రౌండ్ లో మ్యాచ్ ఆడకుండా చేసింది. అంటే.. అన్ని జట్లూ.. ఇతర వేదికలపైనే తమ మ్యాచ్ లు అడనున్నాయి.