Begin typing your search above and press return to search.

ఐపీఎల్.. హైదరాబాద్ ఏం పాపం చేసింది?

By:  Tupaki Desk   |   8 March 2021 11:30 PM GMT
ఐపీఎల్.. హైదరాబాద్ ఏం పాపం చేసింది?
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు రంగం సిద్ధమైంది. ఈ ఏప్రిల్ 9 నుంచి దేశవ్యాప్తంగా క్రికెట్ పండుగ జరుగనుంది. అయితే ఈసారి కరోనా కల్లోలంతో దేశంలోని ఆరు నగరాలకే అవకాశం ఇచ్చారు. ఢిల్లీ, ముంబై, కోల్ కోత, బెంగలూరు, చెన్నై, అహ్మదాబాద్ లకు చాన్స్ ఇచ్చారు.నిజానికి హైదరాబాద్ ను ఐపీఎల్ వేదికగా మార్చాలని మంత్రి కేటీఆర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ బీసీసీఐని డిమాండ్ చేసినా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. హైదరాబాద్ అభిమానులు కోరినా వినలేదు.

ఇక ఏపీలోని విశాఖలో ఓ స్టేడియం ఉన్నా అసలు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. కనీసం ఏపీ నుంచి కూడా ఒక్కరు కోరినా పాపన పోలేదు. ఏపీ క్రికెట్ సంఘం పట్టించుకోలేదు. అస్సలు ఐపీఎల్ టీం లేని అహ్మదాబాద్ ను వేదికగా ఎంపిక చేయడంపై హైదరాబాద్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.

హైదరాబాద్ కు టీం ఉన్నా.. మంత్రి కేటీఆర్ ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తామన్నా.. గుజరాత్, మహారాష్ట్రతో పోలిస్తే హైదరాబాద్ లో కరోనా తక్కువగా ఉన్నా మనపై క్రికెట్ పాలకులు వివక్ష చూపుతున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రధాని మోడీ షాల సొంత రాష్ట్రం అహ్మదాబాద్ ను వేదికగా చేర్చడంపై మండిపడుతున్నారు. అసలు టీం లేని అహ్మదాబాద్ ను చేర్చి టీం ఉన్న హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియాన్ని చేర్చకపోవడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో కడిగిపారేస్తున్నారు.