Begin typing your search above and press return to search.
ఇంటెలిజెన్స్ వెంకటేశ్వర రావు అవే విధుల్లో?
By: Tupaki Desk | 31 March 2019 7:42 AM GMTఇప్పటికే తీవ్రమైన వివాదాన్ని రేకెత్తించిన ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు బదిలీ వ్యవహారంపై ఇంగ్లిష్ దినపత్రిక ‘డెక్కన్ క్రానికల్’ ఒక ఆసక్తిదాయకమైన కథనాన్ని ప్రచూరించింది. దాని ప్రకారం.. బదిలీ అయినా ఏబీ వెంకటేశ్వరరావు అవే విధుల్లో ఉన్నారట. అధికారికంగా వెంకటేశ్వరావును బదిలీ చేసినట్టుగా ఉత్తర్వులు అయితే ఇచ్చారు కానీ.. మౌఖికంగా ఆయన విధుల్లో కొనసాగుతారని ఇంటెలిజెన్స్ విభాగానికి ఆదేశాలు వచ్చాయట.
ఈ విషయాలను ఆ పత్రిక పేర్కొంది. వెంకటేశ్వరరావు బదిలీ వ్యవహారం ఎంత రచ్చగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ముందుగా ఆయనను ఆ విభాగం నుంచి బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులను ఇచ్చింది. వాటి ప్రకారం ఆయన బదిలీపై ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఆపై ఆయన బదిలీని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం మరో జీవోను ఇచ్చింది. ఆ వ్యవహారం చివరకు కోర్టుకు వెళ్లింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు డీజీ వెంకటేశ్వరరావు బదిలీ జరిగింది.
ఆ కథ అలా ముగిసింది అనుకుంటే… బదిలీ ఉత్తుత్తి దే అని - వెంకటేశ్వరరావు మళ్లీ ఇంటెలిజెన్స్ విభాగంతో కో ఆర్డినేట్ అవుతూ ఉన్నారని - ఆ శాఖ పనుల్లో ఆయన జోక్యం కొనసాగుతూ ఉందని ‘డెక్కన్ క్రానికల్’ పేర్కొంది.
ఇంటెలిజెన్స్ కొత్త విభాగానికి కొత్త డీజీ వచ్చినా.. వెంకటేశ్వరరావు ఆ విభాగంపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఆ పత్రిక వివరించింది. ఇంటెలిజెన్స్ విభాగంలోని సిబ్బందికి కూడా ఈ మేరకు మౌఖికంగా ఆదేశాలు వచ్చాయని క్రానికల్ పేర్కొనడం విశేషం.