Begin typing your search above and press return to search.
జైళ్ల శాఖ డీఐజీ రూపకు కిరణ్ బేడీ మద్దతు!
By: Tupaki Desk | 14 July 2017 2:03 PM GMTపరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని డీఐజీ రూప చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ డేరింగ్ & డాషింగ్ పోలీస్ ఆఫీసర్ కు దేశవ్యాప్తంగా పలువురు మద్దతు ఇస్తున్నారు. ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ కూడా సోషల్ మీడియాలో డిఐజీ రూపను అభినందించారు.
ఎవ్వరికీ భయపడకుండా ధైర్యంగా నిజాలు భయటపెట్టినందుకు సాటి మహిళగా గర్వపడుతున్నానని బేడీ అన్నారు. దేశంలోని మహిళా అధికారులందరూ ఇలాగే ధైర్యంగా విధులు నిర్వహించాలని కోరుకుంటున్నానని తెలిపారు. కిరణ్ బేడీ వ్యాఖ్యలకు డీఐజీ రూప స్పందించారు. సోషల్ మీడియాలో కిరణ్ బేడీకి ధన్యవాదాలు తెలిపారు. కిరణ్ బేడీ అభినందించడంతో తనకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు ఉందని తెలుపుతూ రూప సోషల్ మీడియాలో కిరణ్ బేడికి కృతజ్ఞతలు తెలిపారు.
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైళ్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ దగ్గర రూ. 2 కోట్లు లంచం తీసుకుని వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని, ఈ విషయంపై దర్యాప్తు చేయించాలని రూప ప్రభుత్వానికి, పై అధికారులకు లేఖ రాసి సంచలనానికి తెర తీసిన విషయం తెలిసిందే. రూప చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పిన సంగతి విదితమే.