Begin typing your search above and press return to search.
టీడీపీ విమర్శల కు ఐపీఎస్‌ల కౌంటర్
By: Tupaki Desk | 4 Dec 2019 4:31 PM GMTమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీల రాజధాని అమరావతి లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటన సందర్భం గా కొందరు రైతులు చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్ళు విసిరారు. గత ఐదేళ్లు చంద్రబాబు గ్రాఫిక్స్ పేరు చెప్పి తమని మోసం చేశారని వారు ఆరోపిస్తూ చంద్రబాబు పర్యటనకు నిరసన తెలిపారు. ఇక ఈ ఘటనపై సీరియస్ అయిన ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ దీనిపై సిట్ వేశారు. అలాగే దాడి కి పాల్పడ్డ నిందితులని అరెస్టు చేశారు. ఇంత చేసినా టీడీపీ నేతలు మాత్రం డిజిపి, పోలీసులపై ఆరోపణలు చేశారు.
వైసీపీ నేతల కు మద్దతుగా డీజీపీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ మీద కేంద్ర హోం శాఖ కార్యదర్శి కి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేతల ఆరోపణలపై ఏపీ ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. పోలీసులపై ఆరోపణలు చేసే ముందు రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని, కానిస్టేబుల్ నుంచి పోలీస్ బాస్ వరకూ పోలీసు సిబ్బందిపై నిరాధార ఆరోపణలు చేయడం కొన్ని రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందని వాళ్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అలాగే రాజకీయ నాయకులు పోలీసుల పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రజల భద్రత, శాంతి, ప్రశాంతతను కాపాడటానికి పగలు, రాత్రి తేడా లేకుండా పని చేసే తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని వారు పేర్కొన్నారు. ఈ విధమైన ఆరోపణలతో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయాలని, ఆత్మ స్థైర్యం దెబ్బ తీయాలని చూడటం మంచిది కాదని అన్నారు.
ఇటువంటి ఆరోపణలు పోలీసు ప్రతిష్ఠను దిగజారుస్తాయని ఐపీఎస్ అధికారుల సంఘం పేర్కొంది. కాగా, ప్రతిపక్ష నాయకుడి హక్కులను పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ టిడిపి నాయకులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే ఐపీఎస్ ఆఫీసర్ల సంఘం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఏదేమైనా బాబు అమరావతి పర్యటనకు అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఈ డిప్రెషన్లోనో ఏమో గాని టీడీపీ వాళ్లు అటు వైసీపీతో పాటు ఇటు పోలీసులపై కూడా విమర్శలు చేస్తున్నారు.