Begin typing your search above and press return to search.

పెద్దన్నను నిషేధిస్తామన్న దేశాధినేత

By:  Tupaki Desk   |   29 Jan 2017 4:55 AM GMT
పెద్దన్నను నిషేధిస్తామన్న దేశాధినేత
X
బాధ్యతగా వ్యవహరించిన వారు తొందరపాటును ప్రదర్శిస్తే ఏం జరుగుతుందన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరును చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగినప్పుడు ఆయన ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారో.. ఇప్పుడు అంతే మొండిగా.. మూర్ఖంగా వ్యవహరిస్తూ..కలకలం రేపే నిర్ణయాల్ని వరుసగా తీసుకుంటున్నారు. ఆయన తీరుతో ఇప్పుడు అన్ని దేశాల్లోనూ ట్రంప్ పాలనపై చర్చ సాగుతుంది.

ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికాలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు ఇప్పుడు అందరిపైనా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కీలకమైన విదేశాంగ విధానంలో ఈ మధ్య కాలంలో ఏ అగ్రరాజ్యాధినేత వ్యవహరించని రీతిలో వ్యవహరిస్తున్న ట్రంప్ తీరు కొత్త ఉద్రిక్తతలకు దారి తీస్తుంది. తాజాగా తన నిర్ణయంలో భాగంగా ఏడు ముస్లిం మెజార్టీ దేశాలపై అమెరికా వీసా నిషేధాన్ని విదించిన అమెరికా తీరుపై ప్రపంచంలో పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. ఇది సరైన చర్య ఎంతమాత్రం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా నిషేధం విధించిన ఏడు దేశాల్లో ఇరాన్ ఒకటన్నది తెలిసిందే. తమపై వీసా నిషేధాన్ని విధించిన అమెరికాపై ఆ దేశాధ్యక్షుడు హసన్ రౌహానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దెబ్బకు దెబ్బ అన్న చందంగా..అమెరికాలోకితమ దేశీయుల్ని అనుమతించమన్న ట్రంప్ మాటకు అంతే ధీటుగా రియాక్ట్ అయిన ఆయన.. తమ దేశంలోకి అమెరికన్లను అనుమతించమని.. నిషేధం విధిస్తామని చెబుతున్నారు.

ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్ధం.. తర్క రహితంగా అభివర్ణించిన ఇరాన్ విదేశాంగ శాఖ.. ఈ నిర్ణయం ముస్లిం ప్రపంచాన్ని.. ఇరాన్ ను బహిరంగంగా అవమానించటంగా అభివర్ణించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య గోడలు కట్టాల్సిన సమయం ఎంతమాత్రం కాదని.. రెండు దేశాల మధ్యనున్న గోడల్ని.. కొన్నేళ్ల క్రితమే బద్ధలు కొట్టిన వైనాన్ని ట్రంప్ మర్చిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. జర్మీనిని రెండుగా చేసే బెర్లిన్ గోడను ఆ మధ్యన జర్మన్లు కలిసికట్టుగా కూల్చేయటం తెలిసిందే. అమెరికా నిషేధంపై ఘాటుగా రియాక్ట్ అయిన ఇరాన్ దేశాధ్యక్షుడి బాటలో రానున్న రోజుల్లో మరెంత మంది రియాక్ట్ అవుతారో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/