Begin typing your search above and press return to search.
ఇరాన్ దమ్ముకు దండం పెట్టాల్సిందే బాసూ!
By: Tupaki Desk | 25 April 2019 5:18 AM GMTకంటి చూపుతో రైలుతో ఆపేయటం.. జస్ట్ అలా చేత్తో ఒక గుద్దు గుద్దితే.. పెద్ద గోడ కూలిపోవటం.. కాలితో ఒక్క తన్ను తన్నితే.. పైప్ లైన్ పగిలిపోయి.. నీళ్లు చిమ్మటం.. ఇలా.. ఒకటా రెండో.. హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి టాలీవుడ్ దర్శకులు పడే తిప్పలు అన్ని ఇన్ని కావు. మరింత హీరోయిజం వెండితెర మీద చూసిన తర్వాత..రియల్ లైఫ్ లో హీరోయిజం కంటికి ఆనదు. కానీ.. అసలుసిసలైన హీరోయిజం ఎలా ఉంటుందో మాటల్లోనూ.. చేతల్లోనూ చేసి చూపిస్తోంది బుల్లిదేశమైన ఇరాన్.
అమెరికా.. ఇరాన్ మధ్య పంచాయితీలు ఎలా ఉన్నా.. తనకు ఇరాన్ తో పడటం లేదు కాబట్టి.. ఆ దేశం ఉత్పత్తి చేసే ముడిచమును అస్సలు కొనద్దంటూ ఫర్మానా జారీ చేసింది. అమెరికా నోటి వెంట మాట వచ్చినంతనే.. మోడీ లాంటి నేత ప్రధానిగా ఉన్నా.. సరే సార్.. మీరు చెప్పిన తర్వాత ఇరాన్ దగ్గర ఆయిల్ ఎందుకు కొంటామంటూ విధేయతతో బదులు ఇవ్వటమే కానీ.. మా ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా నువ్వు చెప్పేదేంది? అన్న మాట అనే ధైర్యం మనకు లేని పరిస్థితి.
ఇంత తోపులం.. అంత తోపులం.. ప్రపంచంపై మన ముద్ర వేస్తున్నామన్న మాటలు తప్పించి.. వాస్తవంలో అలాంటి పరిస్థితి కనిపించదు. భారత్ లాంటి దేశం కూడా అమెరికా ఆంక్షలకు జీ హుజూర్ అన్నట్లు రియాక్ట్ అవుతున్న వేళ.. ఇరాన్ లాంటి చిన్న దేశం ఎంతలా వణకాలి. పెద్దన్నతో పెట్టుకుంటే తన పని మాటాష్ అన్న విషయానికి వాళ్లు బయటపడని తీరు చూస్తే.. ఉక్కుఛాతీ అంటే ఎలా ఉంటుంది? అలా ఉన్న వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో అర్థమవుతాయి.
ఇరాన్ ముడిచమురు ఎగుమతిపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ వణకటం లేదు. దారులు మూసుకుపోతున్న వేళ.. కొత్త దారుల్ని కనిపెడుతున్న తీరు చూస్తే శభాష్ అనకుండా ఉండలేం. చమురు అమ్మకాలను నిలిపివేయగలిగామని వారు అనుకుంటున్నారేమో.. మా దేశ ప్రజలు.. మా అధికారులు కష్టపడని అన్ని అడ్డంకుల్ని అధిగమిస్తారు.. ముడి చమురు బదులు.. శుద్ధి చేసిన చమురు.. పెట్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతుల మీద దృష్టి పెడదామంటూ ఇరాన్ సర్వోన్నత నాయకుడు ఆయతొల్లా ఆలీ ఖమెనేయి నోటి నుంచి వచ్చిన మాట వింటే.. అదీ హీరోయిజం అన్న భావన కలుగక మానదు.
ముడిచమురుకు బదులు శుద్ధి చేతన చమురు.. పెట్రో కెమికల్ ఉత్పత్తుల ఎగుమతుల మీద దృష్టి పెడితే.. వాటికి కొరత ఉండటం.. అందరి నుంచి డిమాండ్ ఉండటంతో.. వాటిని కొనుగోలు చేయటానికి ఎగబడతారు. అలా కొనే వారిని కంట్రోల్ చేయటం అమెరికాకు ఇబ్బందే కాబట్టి.. మౌనంగా ఉంటుందన్నది ఇరాన్ ఆలోచనగా చెప్పాలి. తమ మీద నిషేధం విధించిన వేళ.. వణికిపోని ఇరాన్ తాజాగా అమెరికాకు ఒక అల్టిమేటం జారీ చేసింది.
అన్ని ఒత్తిళ్లనూ తొలగించి.. చట్టవ్యతిరేక చర్యలకు క్షమాపణ చెప్పి.. పరస్పర గౌరవమర్యాదలకు అంగీకరించినప్పుడే అమెరికాతో చర్చలు జరుపుతామని స్పష్టం చేయటం ఒక ఎత్తు అయితే.. ఇరాన్ పై పెద్దన్న ఆంక్షల నేపథ్యంలో చమురు ఉత్పత్తిని పెంచమని సౌదీ స్పష్టం చేయటం గమనార్హం. ఈ మొత్తం ఎపిసోడ్ లో అమెరికా లాంటి పెద్దన్న ఒత్తిళ్లను ఎదుర్కొంటూ.. ఎక్కడా తగ్గేది లేదని.. ఆత్మాభిమానానికి మించింది లేదని తేలుస్తూ.. ఇరాన్ వ్యవహరిస్తున్న వైఖరి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలుసిసలు హీరోయిజం ఏమిటో తాజా ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది.