Begin typing your search above and press return to search.

ఆ దేశంలో కరోనా సమాధులు అలా ఏర్పాటు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   15 March 2020 2:30 AM GMT
ఆ దేశంలో కరోనా సమాధులు అలా ఏర్పాటు చేస్తున్నారు
X
వణికిస్తున్న కరోనా మాహమ్మారి తీవ్రత ఎంత ఉందన్న విషయాన్ని తెలిపే పలు పరిణామాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. చైనా తర్వాత కరోనాకు ప్రభావితమైన దేశంగా ఇరాన్ ను చెబుతన్నారు. తమ దేశంలో ఇప్పటివరకూ కరోనా కారణంగా 429 మంది మాత్రమే చనిపోతున్నట్లు చెబుతున్నా.. అక్కడి పరిస్థితులు.. శాటిలైట్ చిత్రాలు మాత్రం మరోలాంటి సమాచారాన్ని అందిస్తున్నట్లు చెబుతున్నారు.

కరోనా పుట్టుకకు కారణమైన చైనా దేశం తర్వాత.. ఆ వైరస్ బారిన అంతే ఎక్కువగా ప్రభావితమైన దేశం ఏమిటన్న విషయానికి వస్తే.. అందరి వేళ్లు ఇరాన్ వైపే చూపిస్తున్నాయి. తాజాగా కొన్ని అంతర్జాతీయ మీడియా చానళ్లు చూపిస్తున్న దాని ప్రకారం.. ఇరాన్ రాజధాని టెహరాన్ కు 145 కి.మీ. దూరంలో కోమ్ సిటీ వద్ద కరోనా సమాధుల్ని తవ్వుతున్నట్లుగా చెబుతున్నారు.

ఈ వైరస్ బారిన పడిన వారిని ఖననం చేసేందుకు ఒక్కొక్కరిగా కాకుండా సామూహికంగా అంత్యక్రియలు చేస్తున్నట్లు చెబుతున్నారు. 100 గజాల పొడవు ఉన్న సమాధులు.. అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని శాటిలైట్ చిత్రాలు బయటకు వచ్చాయి. వీటి ప్రకారం చూస్తే.. ఇరాన్ లో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.