Begin typing your search above and press return to search.
‘‘సర్జికల్ స్ట్రైక్స్’’ షాక్ తో పాక్ కు మరో షాక్
By: Tupaki Desk | 30 Sep 2016 6:43 AM GMTదాయాది పాక్ గడ్డపైకి తొలిసారి దూసుకెళ్లిన భారత సైనికుల బృందం.. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పాక్ మీద భారత్ చేసిన ‘లక్షిత దాడి’ షాక్ గురించే మాట్లాడుకున్నారు. కానీ.. పాకిస్థాన్ కు మనతో పాటు మరో దేశం కూడా ఊహించని షాక్ ఇచ్చింది. ఒకే రోజు రెండు దేశాలిచ్చిన డబుల్ షాక్ తో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరి అయింది. తీవ్ర ఒత్తిడికి గురైంది. భారత సైనికుల దాడి నేపథ్యంలో పాక్ కు తగిలిన మరో దాడి సమాచారానికి ప్రాచుర్యం దక్కలేదు.
పాక్ పెంచి పోషించే ఉగ్రవాద స్థావరాల మీద భారత సైనిక బృందం లక్షిత దాడి చేసిన రోజునే పాక్ కు మరో వైపు నుంచి ఇరాన్ కాల్పులు జరపటం ఆ దేశానికి మైండ్ బ్లాక్ చేసేలా చేసింది. బలూచిస్థాన్ ప్రాంతంలో పాక్ పైకి ఇరాన్ మూడు మోర్టార్లను ప్రయోగించింది. దీంతో పాక్ సైనికులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇరాన్ సైనికులు పేల్చిన మోర్టార్ షెల్స్ పాక్ సరిహద్దుల్లోని పంజ్ గూర్ జిల్లాలో పడినట్లుగా బలూచిస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.
ఇరాన్ దాడి కారణంగా ఎలాంటి ప్రాణ.. ఆస్తి నష్టం జరగనప్పటికీ.. ఒకే రోజున రెండు వైపుల నుంచి రెండు దేశాల నుంచి ఎదురైన ఈ దాడులు పాక్ ను దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇరాన్ తో పాక్ కు 900 కిలో మీటర్ల మేర సరిహద్దు ఉంది. పాక్ పదే పదే ఉగ్రవాద దాడుల్ని ప్రోత్సహిస్తుందంటూ ఆరోపిస్తున్న ఇరాన్.. పాక్ కు తాజాగా తన కాల్పులతో వార్నింగ్ ఇచ్చిందన్న మాట వినిపిస్తోంది. వాస్తవానికి ఇరాన్.. పాక్ దేశాల మధ్య సరిహద్దు ఉగ్రవాదానికి చెక్ పెట్టేలా ఒప్పందం జరిగినప్పటికీ.. దానికి తూట్లు పొడిచేలా పాక్ వ్యవహరించటంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా ఆ దేశం కాల్పులకు తెగబడటం చూసినప్పుడు పాక్ టైం ఏ మాత్రం బాగోలేదన్న భావన కలగటం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/