Begin typing your search above and press return to search.
కరోనాతో వారికి అలా కలిసి వచ్చింది
By: Tupaki Desk | 9 March 2020 1:56 PM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలవర పెడుతున్న విషయం తెల్సిందే. చైనాలో వేలాది మంది ఇప్పటికే కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. వందల నుండి వేలకు మృతుల సంఖ్య పెరిగింది. చైనా తర్వాత అత్యధికంగా ఇరాన్ లో కరోనా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇరాన్ లో ఇప్పటికే 194 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక అక్కడ దాదాపుగా 800 మంది కరోనా వైరస్ బారిన పడ్డట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
కరోనా వైరస్ భయంతో ఇరాన్ లోని దాదాపు 70 వేల మంది ఖైదీలను విడుదల చేశారు. వైరస్ అంతకంతకు పెరుగుతున్న ఈ సమయంలో జైల్లో ఖైదీలు ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదంటూ ఇరాన్ న్యాయ వ్యవస్థ చీఫ్ ఇబ్రహీం రైసీ అభిప్రాయ పడ్డారు. అందుకే వారందరిని కూడా జైల్లోంచి బయటకు పంపించేయాలనే నిర్ణయానికి వచ్చామని చెప్పారు.
వారంతా కూడా బయటకు వెళ్లడం వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతాయో అంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాని ఆయన మాత్రం అలాంటిది ఏమీ జరగదని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖైదీలు ఎలాంటి నేరాలకు పాల్పడరని అన్నాడు. మొత్తానికి కరోనా ఎఫెక్ట్ తో జీవిత ఖైదీలు కాస్త బయట పడ్డారు. ప్రస్తుతం వారంతా కూడా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు.
--