Begin typing your search above and press return to search.

ఆ సంప‌న్న దేశం ఫ‌స్ట్ ప్ర‌యారిటీ ఆహార‌మేన‌ట‌

By:  Tupaki Desk   |   23 Jun 2017 4:56 AM GMT
ఆ సంప‌న్న దేశం ఫ‌స్ట్ ప్ర‌యారిటీ ఆహార‌మేన‌ట‌
X
ప్రపంచంలోనే అత్యంత ధ‌నిక దేశ‌మైన ఖ‌తార్ ప‌రిస్థితి ఇప్పుడు మ‌హా చిత్రంగా మారింది. చేతిలో కావాల్సినంత డ‌బ్బున్నా.. తినేందుకు మాత్రం తిండి లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్పుడా దేశంలో తిండి కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నిఇన్ని కావు. ఉగ్ర‌వాదానికి సాయంగా నిలుస్తుంద‌న్న ఆరోప‌ణ‌ల‌తో సౌదీతో స‌హా.. పొరుగు దేశాలన్నీ ఖ‌తార్‌ కు ఆహారాన్ని పంపే విష‌యంలో నిషేధం విధించేశాయి. ఫ‌లితంగా ఆహారం విష‌యంలో ఖ‌తార్ తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతోంది.

ఈ క్ర‌మంలో తీవ్ర ఆహార కొర‌త ఎదుర్కొంటున్న ఆ దేశానికి ఇరాన్ ఇప్పుడు దేవుడిలా మారింది. ఇరాన్‌ రాజ‌ధాని నుంచి రోజూ క‌నీసం రెండు నౌక‌ల ద్వారా ఆహారం ఖ‌తార్‌ కు వెళుతోంద‌ట‌. ప్ర‌తిరోజూ 100 ట‌న్నుల ఆహార ప‌దార్థాల ఎగుమ‌తి అయితే త‌ప్ప ఖ‌తార్‌కు ఆక‌లి తీరే ప‌రిస్థితి లేదు. ఖ‌తార్‌ కు ఇరాన్ పంపే రెండు నౌక‌ల్లో క‌నీసం 156 ట‌న్నుల బీఫ్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందేన‌ట‌. నౌక‌ల ద్వారా పంపే ఆహారం స‌రిపోని నేప‌థ్యంలో.. విమానాల ద్వారా కూడా ఆహారాన్ని పంపుతున్నారు.

ఇప్పుడు ఇరాన్ నుంచి ఖ‌తార్ వెళుతున్న దాదాపుగా అన్ని విమానాల్లోనూ ఆహారమే వెళుతోందట‌. ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తోంద‌ని.. ఉగ్ర‌మూక‌ల‌కు షెల్టర్ గా మారింద‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఇలా తిండికి తిప్ప‌లు ప‌డుతున్న నేప‌థ్యంలో ఇప్పుడా దేశంలో ఫ‌స్ట్ ప్ర‌యారిటీ తిండికేన‌ట‌. సంప‌ద ఎంత ఉన్నా.. తినేందుకు తిండి లేక‌పోతే ఆ తిప్ప‌లే వేర‌న్న విష‌యం ఖ‌తార్‌ను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/