Begin typing your search above and press return to search.

పాక్‌ ను కోలుకోలేని దెబ్బ‌తీసిన మోడీజీ

By:  Tupaki Desk   |   4 Dec 2017 7:07 AM GMT
పాక్‌ ను కోలుకోలేని దెబ్బ‌తీసిన మోడీజీ
X
ఔను. కేవ‌లం రూ.548 కోట్ల‌తో పొరుగునే ఉన్న‌ప్ప‌టికీ...ప‌క్క‌లో బ‌ల్లెంలా మారిన రెండు దేశాల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ షాకిచ్చారు. మ‌రో రెండు కీల‌క దేశాల‌తో దోస్తీ క‌ట్టారు. బెదిరించిన...ఇంకా చెప్పాలంటే మనల్ని బ్లాక్‌ మెయిల్ చేసిన్ దాయాది దేశం పాకిస్థాన్‌ కు చెంపపెట్టు వంటి రిప్లై ఇచ్చారు. పాక్ కాదంటే విల‌విల‌లాడిపోమని స్పష్టం చేస్తూ....భార‌త్ త‌లుచుకుంటే..ఏం చేయ‌గ‌ల‌దో నిరూపించారు మోడీజీ. ఇంత‌కీ ఇదంతా దేని గురించి అంటే...చాబ‌హ‌ర్ పోర్ట్ గురించి.

త‌న ప్రాదేశిక జలాల గుండా సరుకురవాణా ఓడల్ని అనుమతించబోనని పాకిస్థాన్ స్పష్టం చేయడంతో గ‌త ఏడాది మ‌న‌కు గ‌ల్ఫ్ దేశాల‌తో వాణిజ్య సంబంధాల విష‌యంలో అస్ప‌ష్ట‌త నెల‌కొంది. అయితే వెంట‌నే ప్ర‌త్యామ్యాయాలు వెతికిన కేంద్ర ప్ర‌భుత్వం గల్ఫ్ ఆఫ్ ఒమన్‌ లో భారత్ ఈ పోర్ట్ నిర్మాణాన్ని చేపట్టింది. గత ఏడాది మేలో సంయుక్త భాగస్వామ్యంతో చాబహార్ ఓడరేవును నిర్మించాలని భారత్-ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలిదశ పోర్టు నిర్మాణానికి భారత్ 85మిలియన్ డాలర్లు (రూ.548కోట్లు) ఖర్చు చేసింది. ఆగ్నేయ ఇరాన్‌ లోని సిస్తాన్-బలూచిస్థాన్ రాష్ర్టాల మధ్య చాబహార్ పోర్ట్‌ ను నిర్మించారు.తొలి దశ నిర్మాణం పూర్తిచేసుకున్న చాబహార్ పోర్ట్ ఆదివారం ప్రారంభమైంది. హహీద్ బహెష్తీ పేరు పెట్టిన తొలిదశ ఓడరేవును ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని లాంఛనంగా ప్రారంభించారు. ఆఫ్ఘనిస్థాన్ - ఇరాన్‌ లతో వ్యూహాత్మక వాణిజ్య రవాణాకు ఉపయోగపడేలా భారత్ నిర్మించిన తొలి ఓడరేవు ఇదే. భారత్-ఇరాన్-ఆఫ్ఘనిస్థాన్ త్రైపాక్షిక సంబంధాల్ని మరింత బలోపేతం చేసే దిశగా దీన్ని నిర్మించారు.

పాకిస్థాన్‌ లో చైనా పెట్టుబడి పెట్టి నిర్మిస్తున్న గ్వదర్ పోర్ట్‌ కు దీటుగా దానికి 80 కిమీ దూరంలోనే ఇరాన్‌ తో కలిసి చాబహార్ పోర్ట్‌ ను నిర్మించడం భారత్ వ్యూహాత్మకంగా తీసుకున్న చర్య. దీనివల్ల మిత్రదేశం ఇరాన్‌ తో సఖ్యత నెరుపుతూనే పాక్ - చైనా ప్రమేయం లేకుండానే ఆఫ్ఘనిస్థాన్ - మధ్యాసియా దేశాలకు సరుకుల్ని మోసుకెళ్లగలగడంతోపాటు దీన్ని అత్యవసర సందర్భాల్లో సైనిక అవసరాలకు వాడుకోవడం ఈ వ్యూహాంలోని కీలకాంశాలు. తద్వారా పాకిస్థాన్‌ కు అనూహ్య‌మైన షాక్ ఇచ్చిన‌ట్ల‌యింది. పాక్ అవ‌స‌రం లేకుండానే మ‌న వాణిజ్య అవ‌స‌రాలు తీర్చుకోవ‌డంతో పాటుగా...భ‌విష్య‌త్‌ లో `తేడా` వ‌స్తే అందుకు త‌గిన రీతిలో సైన్యం స్పందించే వీలు క‌లుగుతుంది. తొలిదశ పోర్టు నిర్మాణానికి భారత్ 85మిలియన్ డాలర్లు (రూ.548కోట్లు) ఖర్చు చేసింది. ఇక పూరిస్థాయి పోర్టు నిర్మాణానికి 340 మిలియన్ డాలర్లు - నౌకాశ్రయానికి - రోడ్ల అనుసంధానానికి - రైలుమార్గాల నిర్మాణానికి మరో 160 మిలియన్ డాలర్లు (రూ.1032 కోట్లు) ఖర్చుచేస్తున్నది. ఈ రేవుపై పదేళ్ల‌పాటు భారత్‌ కు లీజ్ హక్కులు కూడా దక్కుతాయి.

ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని ప్రసంగిస్తూ... ఇరుగుపొరుగు దేశాల మధ్య ప్రాంతీయంగా సత్సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. `ఆశావహ పోటీ అందరికీ మంచిది. మేం మరిన్ని ఓడరేవులు రావాలని కోరుకుంటున్నాం. గ్వదర్ ఓడరేవు అభివృద్ధినీ స్వాగతిస్తున్నాం` అని చెప్పారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి భారత్ - ఖతర్ - ఆఫ్ఘనిస్థాన్ - పాకిస్థాన్ సహా 17 దేశాల 60మంది ప్రతినిధులు హాజరయ్యారని ఇరాన్ ప్రభుత్వ టీవీ చానెల్ తెలిపింది. అంతకు ముందు భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ - ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ తెహ్రాన్‌ లో శనివారం భేటీ అయ్యారు. చాబహార్ పోర్ట్ ప్రాజెక్టు అమలు తీరుపై వారు సమీక్షించారు.