Begin typing your search above and press return to search.
అలా కనిపించడం కోసం 43 ఆపరేషన్ లు.. చివరకు ఏమైందంటే!
By: Tupaki Desk | 17 April 2023 6:07 PM GMTఅమ్మాయిలకు అందం అంటే ప్రాణం.. అందంగా కనిపించేందుకు ఏం చేసేందుకు అయినా సిద్ధం. కొందరు ప్రాణాలను సైతం లక్ష్య పెట్టకుండా అందంగా కనిపించేందుకు గాను ఆపరేషన్స్ చేయించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. హీరోయిన్స్ లో కొందరు ఇంత అందంగా కనిపిస్తున్నారు అంటే ఆపరేషన్ కూడా కారణం అనడంలో సందేహం లేదు.
ఇరాక్ కు చెందిన డాలియా అనే యువతి తనను తాను బార్బీ డాల్ గా మార్చుకునేందుకు సిద్ధం అయ్యింది. 29 ఏళ్ల డాలియా నయీమ్ బార్బీ డాల్ గా మారేందుకు గాను ఆపరేషన్స్ కు సిద్ధం అయ్యింది. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఏకంగా 43 ప్రొసీజర్లు చేయించుకుని తన రూపం ను పూర్తిగా మార్చేసుకుంది.
ఇప్పుడు ఆమెను చూడగానే బార్బీ డాల్ గుర్తుకు వచ్చేలా చేసింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆమె ఎందుకు బార్బీ డాల్ గా మారాలి అనుకుంది అనే విషయం క్లారిటీ లేదు కానీ కచ్చితంగా ఆమె అనుకున్నది నెరవేరిందని అంటారు. డాలియా ను చాలా మంది ఇరాక్ బార్బీ అంటూ పిలుస్తూ ఉంటారు. అలా పిలిచిన సమయంలో తాను పడ్డ కష్టంకు ప్రతిఫలం దక్కిందని భావిస్తాను అంది.
అమ్మాయిల్లో ఎక్కువ శాతం మందికి బార్బీ డాల్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ ఈ యువతి మాత్రం తానే ఒక బార్బీ డాల్ గా మారిపోయి ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలవడంతో పాటు అందమైన యువతిగా కూడా పేరును దక్కించుకుంది.
ఇన్ని ఆపరేషన్స్ చేయించుకోవడం పట్ల కొందరు విమర్శిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం డాలియా యొక్క పట్టుదలకు హ్యాట్సాప్ చెబుతున్నారు. ఇప్పటికే బార్బీ డాల్ మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ ముందు ముందు కచ్చితంగా మరిన్ని ఆపరేషన్స్ ను ఈమె చేయించుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.
డాలియా పెదాలు.. ముక్కు.. కళ్లు.. నోరు.. బ్రెస్ట్ ఇలా పలు పార్ట్ లకు సంబంధించి ప్రొసీజర్లు చేయించుకుంది. ముందు ముందు మరింత డెప్త్ గా బార్బీ డాల్ మాదిరిగా కనిపించేందుకు గాను ఇంకాస్త ఎక్కువగానే ఆపరేషన్స్ కు సిద్ధం అవుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. 29 ఏళ్లకే 43 ఆపరేషన్స్ చేయించుకోవడం అంటే మామూలు విషయం కాదు. డాలియా ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని కొందరు అంటూ ఉంటే.. కొందరు మాత్రం అనుకున్నది సాధించేందుకు డాలియా మాదిరిగా కష్టపడాలని అభినందిస్తున్నారు.