Begin typing your search above and press return to search.
అక్కడ నెల పాటు కండోమ్ తోనే చేయాలట
By: Tupaki Desk | 5 Feb 2016 10:30 PM GMTప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్ ను అడ్డుకునేందుకు ఆయా దేశాలుకిందామీదా పడుతున్నాయి. జికా వైరస్ విస్తృతి ఎక్కువగా ఉన్న లాటిన్ అమెరికా దేశాల్లో పర్యటించి వచ్చే ఐర్లాండ్ పురుషులకు అక్కడి ప్రభుత్వం సరికొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ లాటిన్ అమెరికా దేశాలకు వెళ్లి వచ్చిన పురుషులు శృంగారం చేయాలనుకుంటే కండోమ్ ను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించింది.
నెల రోజుల పాటు కండోమ్ తో తప్ప.. విడిగా సెక్స్ చేయొద్దని చెప్పిన ఐర్లాండ్ సర్కారు.. ఒకవేళ జికా వైరస్ సోకిన లక్షణాలు (జ్వరం.. తలనొప్పి కనిపిస్తే) కానీ కనిపిస్తే ఆరునెలల పాటు కండోమ్ వాడాలని తేల్చింది. పురుషుల వీర్యం ద్వారా కూడా జికా వైరస్ భాగస్వామికి వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఐర్లాండ్ ప్రభుత్వం ఈ జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇక.. బ్రిటన్ సర్కారు మాత్రం లాటిన్ దేశాల నుంచి తిరిగి వచ్చే వారు నెల రోజుల పాటు రక్తదానం చేయకూడదని పేర్కొంది. ఇక.. కెనడాలోనూ అమెరికా.. యూరప్ ఖండాల్లోని దేశాలకు వెళ్లి వచ్చిన వారు మూడు వారాల పాటు రక్తదానం చేయకుండా ఆంక్షలు విధించింది.