Begin typing your search above and press return to search.
విశ్వవిజేత ఇంగ్లండ్ చెత్త రికార్డు..ఐర్లండ్ మ్యాచ్ లో 85కే ఆలౌట్
By: Tupaki Desk | 24 July 2019 2:12 PM GMTప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసి పది రోజులు కూడా కాకుండానే విశ్వవిజేత ఇంగ్లండ్ కు పసికూన ఐర్లాండ్ చుక్కలు చూపించింది. నెలన్నర రోజులుగా ఎంతో ఆసక్తి రేపిన ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఫైనల్లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ మ్యాచ్ - సూపర్ ఓవర్ రెండూ టై అయినా బౌండరీల ఆధారంగా విజేతగా నిలిచి ఉంది. ఇప్పుడు అదే విశ్వ విజేతకు పది రోజుల్లోనే పసికూన చేతిలో ఘోర అవమానం ఎదురైంది. కనీసం ప్రపంచకప్‌కు కూడా ఎంపిక కాని ఐర్లండ్ చేతిలో కేవలం 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
కొద్ది రోజుల క్రితమే టెస్ట్ హోదా దక్కించుకున్న ఐర్లండ్... విశ్వవిజేత ఇంగ్లండ్ తో లార్డ్ వేదికగా ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ ఐర్లండ్ బౌలర్ల ధాటికి క్యూ కట్టేశారు. పటిష్టమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 85 పరగులకే ఆలౌట్ అవ్వడం ఆ జట్టు ప్రదర్శన ఎంత దారుణంగా ఉందో చెపుతోంది.
కనీసం ఒక్క బ్యాట్స్ మెన్ కూడా ఐర్లండ్ బౌలర్లకు ఎదురొడ్డి నిలవలేదు. కేవలం 23.4 ఓవర్లలో 85 పరుగులకే అవుట్ అయ్యారు. జో డెన్లే(23) - ఒల్లి స్టోన్(19) - శామ్ కర్రన్(18) మినహా మిగితా వారందరూ సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. ఐర్లాండ్ బౌలింగ్ లో టిమ్ ముర్తగ్ 5 - మార్క్ అడైర్ 3 - బాయ్ డ్ రాన్ కిన్ 2 వికెట్లు తీశారు. దీంతో ఇంగ్లండ్ తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిన్నదైన టెస్ట్ ఇన్నింగ్స్ ను ఖాతాలో వేసుకుని ఓ చెత్త రికార్డు క్రియేట్ చేసింది.
ఇంగ్లండ్ ప్రదర్శనతో అప్పుడే సోషల్ మీడియాలో ఆ జట్టుపై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక ఐర్లండ్ కు ఇది కేవలం మూడో టెస్ట్ మ్యాచ్ మాత్రమే. పాకిస్తాన్ - అప్ఘనిస్తాన్ లతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో టఫ్ ఫైట్ ఇచ్చి ఓడిన ఆ జట్టు ఇప్పుడు ఏకంగా విశ్వవిజేతతో మూడో మ్యాచ్ ఆడుతోంది. ఈ టెస్ట్ లో ఐర్లండ్ విజయం సాధిస్తే పెద్ద సంచలనమే అవుతుంది.