Begin typing your search above and press return to search.
ఇర్ఫాన్ పఠాన్ పై నెటిజన్లు ఫైర్!
By: Tupaki Desk | 18 July 2017 11:29 AM GMTకొద్ది రోజుల క్రితం టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షఫీ తన భార్య ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటో పెట్టినందుకు షమీపై కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో బరోడా ఫాస్ట్ బౌలర్ - టీమిండియా ఆల్ రౌండర్ ఇర్సాన్ పఠాన్ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తన భార్య సఫా బేగ్ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో ఇర్ఫాన్ పఠాన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇపుడు ఆ ఫొటో ఇంటర్నెట్ లో వైరల్ అయింది.
ఇర్ఫాన్ పఠాన్ తన భార్య న సఫా బేగ్ ముఖం సగం కనిపించేలా ఉన్న ఫోటోను ఫేస్ బుక్ లో పెట్టాడు. దాని క్రింద "This girl is trouble #love #wifey" అనే క్యాప్షన్ కూడా పెట్టాడు. పఠాన్ పెట్టిన ఈ పోస్ట్ కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా భార్య ముఖం కనిపించేలా ఫొటో సోషల్ మీడియాలో పెట్టడం సరికాదంటూ చాలా మంది ఇర్ఫాన్ ను విమర్శించారు.
ఇందులో సఫా తన ముఖాన్ని రెండు చేతులతో కప్పుకున్నట్టుగా ఉంది. చేతి గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టుకోవడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇస్లాం ప్రకారం నెయిల్ పాలిష్ పెట్టుకోకూడదని, మెహందీ పెట్టుకోమని కొందరు సలహాటిచ్చారు. `ముస్లిం అయి ఉండి నీ భార్య ముఖాన్ని అందరికీ చూపిస్తావా?` అంటూ కొందరు ఘాటుగా ప్రశ్నించారు. భార్య ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టారు. ఆ క్యాప్షన్ ను మరి కొంతమంది తీవ్రంగా తప్పుబట్టారు.
ఇలా ముస్లిం క్రికెటర్లను అభిమానులు విమర్శించడం తొలిసారి కాదు. గతంలో మహ్మద్ షమీ షేర్ చేసిన ఫొటోలో తన భార్య స్లీవ్‌లెస్ దుస్తులు వేసుకుని ఉండటంపై కొంతమంది నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే, షమీ ఆ కామెంట్లకు దీటుగా బదులిచ్చాడు. ఎవరి హద్దుల్లో వారుండాలి అని...షమీ సమాధానం ఇవ్వడంతో నెటిజన్లు వెనక్కి తగ్గారు.