Begin typing your search above and press return to search.
ప్రధాని అని తెలియక.. ఏం చేసిందంటే!
By: Tupaki Desk | 19 Aug 2017 5:01 AM GMTమన దేశ ప్రధాని ఎవరంటే వెంటనే చెప్పేస్తాం! మోడీ బాగా ఫేమస్ కాబట్టి చూడగానే గుర్తుపట్టేస్తాం! కానీ ప్రధాని అంటే తెలియని వారుంటారా? అసలు ఆయన్ను చూడని వారుగానీ.. ఆయన పేరు విననిగానీ ఎవరైనా ఉంటారా? ఇవేం ప్రశ్నలు అని అనుకోకండి. నిజంగానే ఒక హోటల్ లో పనిచేసే వెయిట్రస్ కి తమ దేశ ప్రధాని అంటే ఎవరో తెలియదట. అంతే కాదండోయ్.. ఆమె పనిచేస్తున్న హెటల్ కి ప్రధాని వచ్చినప్పుడు కూడా గుర్తుపట్టకుండా.. ఏమీ ఆర్డర్ తీసుకోకుండా దాదాపు 20 నిమిషాలు వెయిట్ చేయించిందట!! పాపం.. ఆయన తమ దేశ ప్రధాని అని పక్కనన్న వాళ్లు చెబితేగాని ఆమె తెలుసుకోలేకపోయిందంటే.. ఆశ్చర్యం కలగక మానదు!! ఈ విచిత్రకర సంఘటన ఐర్లాండ్ లో జరిగింది.
డబ్లిన్ నగరానికి చెందిన ఇరవై ఏళ్ల ఎమ్మా కెల్లీ చికాగోలోని ఓ హోటల్లో వెయిట్రెస్ గా పని చేస్తోంది. ఐర్లాండు ప్రధాని లియో వరాద్కర్ తన మిత్రుడితో కలిసి ఆ హోటల్ కి వచ్చారట. మొదట ఆమె `మీరు ఐర్లాండుకు చెందిన వారా` అని అడిగిందట. వారు ఏమీ చెప్పకపోవడంతో.. వారిని కాసేపు ఎదురు చూడమని చెప్పిందట. చివరకు వారికి ఒక చిన్నబల్లను కేటాయించిందట. ఇంతలో ఆమె మిత్రుడొకరు ప్రధానిని గుర్తిపట్టారట. ఆయన ఒక సాధారణ బల్ల మీద కూర్చోవడం చూసి.. ఆశ్చర్యపోవడం వారి వంతయిందట. తీరా ఆయన ప్రధాని అని కెల్లీకి చెప్పడంతో.. చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరింది.
దీంతో ఆమె పాపులర్ అయిపోయింది. దీనిపై ఆర్టీఈ రేడియోలో ఆమె మాట్లాడారు. ఆ సమయంలో తాను ఏమనుకున్నారో.. విషయాలన్నీ వివరించింది. తమ హోటల్ కు ప్రధాని వస్తారని అసలు ఊహించలేదని వివరించింది. ఆయనకు సాధారణ టేబుల్ నుంచి మరో టేబుల్ కు మార్చామని.. తెలిపింది. దీనిపై ప్రధాని కూడా సానుకూలంగానే స్పందించారట. ఏం కాదని, తనను సాధారణ పౌరుడిలా భావించడం బాగుందని తనతో చెప్పారని ఎమ్మా వివరించారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. భారతీయ మూలాలున్న వరాద్కర్ ఐర్లాండ్ మొదటి స్వలింగ సంపర్క ప్రధాని. ఆయన తండ్రి ఆశోక్ వరాద్కర్ ముంబైలో పుట్టారు. ఐర్లాండుకు వలస వెళ్లి అక్కడే డాక్టర్ గా స్థిరపడ్డారు.