Begin typing your search above and press return to search.
ఏపీ అధికారుల తప్పు..ఆ రెండు జిల్లాల మీదకు తెచ్చిందా?
By: Tupaki Desk | 21 Aug 2019 5:21 AM GMTభారీగా వర్షం కురుస్తోంది. మీ ఇంటి చూరుకు చిల్లు ఉంది. అందులో నుంచి నీళ్లు కారుతున్నాయి. ఏం చేస్తారు? చూరులో నుంచి వర్షపు నీరు కారే చోట ఒక బక్కెట్టో.. పెద్ద గంగాళాన్నో ఉంచి.. ఎప్పుడు నిండుతుందో అప్పుడు ఆ నీళ్లను బయట పారబోస్తే.. ఇల్లు ఆగమాగం కాకుండా ఉంటుంది.
ఈ చిన్న విషయం అంత పెద్ద ఇరిగేషన్ అధికారులకు ఎందుకు తట్టలేదు. ఏపీలో వర్షం లేదు. పడిన వర్షమంతా కేరళ.. కర్ణాటక.. తమిళనాడులోనే. వర్షం ఎక్కడ పడినా.. చివరకు వచ్చేది నదుల్లోకే.. అలా వచ్చిన నీరు అవసరానికి మించి వస్తుంటే.. పైన ఉన్న ఒక్కో ప్రాజెక్టు తెరిచేస్తూ.. కిందకు నీళ్లను వదిలేస్తుంటారు.
ఇలాంటివేళలో.. ప్రాజెక్టులో అప్పటికే ఉన్న నీరు ఎంత? పైన ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీరు ఎంత? ఆ నీరంతా వచ్చిన తర్వాత ప్రాజెక్టు కండీషన్ ఏమిటి? అదెప్పటికి నిండుతుంది? అలా నిండిన వరద నీటిని ప్రాజెక్టులో నుంచి బయటకు ఎప్పుడు పంపాలన్న దానికి భారీ లెక్కే ఉంటుంది. ఏమైందో ఏమో కానీ..ఇలా పై నుంచి వచ్చే నీటిని శ్రీశైలం.. నాగార్జునసాగర్ నుంచి ఒక్కసారిగా వదలటంతో ఏపీలోని గుంటూరు.. కృష్ణా జిల్లాల్లోని పలు గ్రామాలు వరద నీటితో నిండిపోవటమే కాదు.. పొలాలు భారీగా నష్టపోయిన పరిస్థితి.
మరింత అర్థం అయ్యేలా చెప్పాలంటే.. ఇందాక చెప్పిన ఉదాహరణలోకే వెళదాం. ఇంటి చూరులో నుంచి వర్షపు నీరు కారుతున్నప్పుడు.. కారే చోట బకెట్ పెట్టటంతో పాటు..భారీగా వర్షం పడుతున్నప్పుడు.. చూరుకున్న రంధ్రం పెద్దది కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. ఒక మోతాదు దాటితే.. నీటి ఒత్తిడికి చిల్లు పెద్దది అయితే.. మరిన్ని చోట్ల నీరు కారే ప్రమాదం ఉంది. ఇలాంటప్పుడు పడిన నీళ్లు పడినట్లుగా బయటకు వెళ్లే మార్గంతో పాటు.. చిల్లు పెద్దది కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంటి చూరు మాదిరే.. ఎగువ రాష్ట్రాల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు.. ఇంకా వస్తుందన్న అంచనా ఉన్నప్పుడు.. ఒక క్రమపద్దతిలో నీటిని సముద్రంలోకి విడిచిపెట్టాలి. ఒక్కసారిగా నీటిని వదిలితే నష్టం ఏమంటే.. దిగువున ఉన్న ప్రాంతాలు వరద నీటితో మునిగే ప్రమాదం ఉంటుంది. నిజానికి ఇదంతా ప్రాథమికమైన లెక్క. దీన్ని ఏపీ అధికారులు ఎందుకు మిస్ అయ్యారో? అన్నది ప్రశ్న. అదే సమయంలో ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని క్రమపద్ధతిలో కాకుండా ఒక్కసారిగా భారీ ఎత్తున ఎందుకు దిగువ ప్రాంతానికి వదిలినట్లు? అన్నది మరో ప్రశ్న. ఈ పొరపాటే.. తాజాగా ఏపీ పరిధిలోని కృష్ణా.. గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయేలా చేసిందని చెప్పాలి. వరద నీటిని ఎలా మేనేజ్ చేయాలన్న విషయంలో బేసిక్స్ ను కూడా ఏపీ ఇరిగేషన్ అధికారులు ఎందుకు పాటించనట్లు?