Begin typing your search above and press return to search.
ఆప్ ఎమ్మెల్యేలకు 20 కోట్ల ఆఫర్.. నిజమెంత?
By: Tupaki Desk | 24 Aug 2022 12:30 PM GMTకేంద్రంలోని బీజేపీకి.. ఢిల్లీ సర్కారు ఆప్‌కు మధ్యపచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనే పరిస్థితి మరింత ముదిరింది. తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ కోట్ల రూపాయల ఆఫర్ చేసిందని.. ఒక్కొక్కిరకీ రూ.20 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని.. దీనికి ఒప్పుకోని వారిపై సీబీఐ కేసులు పెడతామని.. బెదిరింపులకు గురిచేసిందని.. ఆప్ నాయకులు ఆరోపించారు. పార్టీ మారిపోవాలని ఢిల్లీకి చెందిన తమ శాసనస భ్యులపై ఒత్తిడి చేస్తోందని ధ్వజమెత్తారు.
లేదంటే సీబీఐ, ఈడీ కేసులు బనాయిస్తామని బెదిరిస్తోందని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలైన అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కుల్దీప్ కుమార్ను బీజేపీ సంప్రదించిందని ఆప్ జాతీయ ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. బీజేపీలో చేరితే ఈ నలుగురికీ రూ.20 కోట్లు చొప్పున ఇస్తామని మాటిచ్చారని చెప్పారు. ఇతర ఎమ్మెల్యేలను కూడా తమతో తీసుకొస్తే రూ.25 కోట్లు ముట్టజెప్తామని ప్రలోభపెడుతోందని వివరించారు. ఈ మేరకు నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి సంజయ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రధాని మోడీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆప్ ఎమ్మెల్యేలను బలవంతంగా బీజేపీ గూటికి చేర్చాలని యత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఆప్ను విడగొట్టి డిల్లీ సర్కారును పడగొట్టడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని, తమ మనుషులను పంపించి బెదిరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు మనీశ్ సిసోడియా మాదిరిగానే సీబీఐ, ఈడీలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని చెప్పారు.
మహారాష్ట్రలో విజయవంతమైన ప్రయోగం, మనీశ్ సిసోడియా విషయంలో విఫలమైందని సంజయ్ చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యేలపై ఆ ప్రయోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక, ఇదే విషయంపై ట్విట్టర్లో స్పందించిన ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఇది తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు. సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సిసోడియా సైతం బీజేపీపై మండిపడ్డారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాణాలైనా ఇస్తారని, అంతేతప్ప పార్టీకి ద్రోహం చేయరని అన్నారు. పార్టీ సభ్యు లంతా కేజ్రీవాల్ సైనికులని, స్వాతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్ అనుచరులని చెప్పుకొచ్చారు. 'నన్ను పార్టీ నుంచి విడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని.. ఎమ్మెల్యేలకు డబ్బు ఆశచూపిస్తున్నారు. సీబీఐ, ఈడీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారు' అని సిసోడియా ట్వీట్ చేశారు.
మరి ఇది నిజమేనా?
జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. బీజేపీ వర్సెస్ ఆప్ వివాదంలో నలుగుతున్న ఆరోపణలు నిజమేనా? అనే చర్చ జాతీయ రాజకీయాల్లో జోరుగా సాగుతుండడం గమనార్హం. దీనిపై దృష్టి పెట్టిన వారు.. ఔననే అంటున్నారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలోను.. మధ్యప్రదేశ్‌లోనూ.. జరిగిన విషయాలను వారు తెరమీదకి తెస్తున్నారు. అధికారం కోసం.. బీజేపీ ఎంతకైనా తెగిస్తున్న పరిణామాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్ తమకు ఎక్కడ పోటీ వస్తుందోననే అనే భావనతో బీజేపీ ఇలా చేసినా చేయొచ్చని కొందరు చెబుతున్నారు.