Begin typing your search above and press return to search.
రామమందిర శంకుస్థాపన.. మోడీకిది న్యాయమేనా?
By: Tupaki Desk | 31 July 2020 1:30 AM GMTదేశవ్యాప్తంగా హిందువులంతా ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రోజు దగ్గర పడుతోంది. ఇంకో ఐదు రోజుల్లోనే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరగబోతోంది. ఆగస్టు 5న ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. కరోనా లేకుంటే కనీ వినీ ఎరుగని రీతిలో ఈ కార్యక్రమం జరిగేదేమో. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరీ హంగామా ఏమీ ఉండదంటున్నారు. ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే జరగనుంది. ప్రధాని పదవిలో ఉండటమొక్కటే మోడీ ఈ శంకుస్థాపన చేయడానికి అర్హత కాదు. ఇప్పుడు రామ మందిరం నిర్మించబోయే చోట ఒకప్పుడున్న రామాలయాన్ని కూల్చి కట్టినట్లుగా చరిత్రకారులు చెబుతున్న బాబ్రీ మసీదును కూలగొట్టడంలో మోడీ పాత్ర కీలకం. 1992 డిసెంబరు 6న జరిగిన ఆ ఘట్టంలో మోడీ ఎంతో కీలకంగా వ్యవహరించాడు.
ఐతే మోడీ చేతుల మీదుగా రామ మందిర శంకుస్థాపన జరగడం అందరికీ ఆమోద యోగ్యమే. కానీ ఈ కార్యక్రమానికి అతిథుల్లో కచ్చితంగా ఉండాల్సిన పేరు ఒకటుంది. అదే.. లాల్ కృష్ణ అద్వానీ. నాడు లక్షన్నర మంది కరసేనను ముందుండి నడిపించి బాబ్రీ మసీదు కూల్చివేతలో అత్యంత కీలక పాత్ర పోషించింది అద్వానీనే. దీనికి తోడు రథయాత్ర నిర్వహించి భారతీయ జనతా పార్టీకి దేశంలో ఒక వేవ్ తీసుకొచ్చి.. కొన్నేళ్లలోనే కేంద్రంలో అధికారం చేపట్టేందుకు కారణమైన వ్యక్తి అద్వానీనే. ఏ రకంగా చూసినా ఆగస్టు 5న రామ మందిర శంకుస్థాపనలో పాల్గొనడానికి నూటికి నూరు శాతం అర్హుడు అద్వానీ. ఒకప్పుడు అద్వానీకి మోడీ ప్రియ శిష్యుడు. మోడీ ఎదుగుదలలో అద్వానీది ప్రధాన పాత్ర. కానీ మధ్యలో వివిధ కారణాల వల్ల ఇద్దరి మథ్య అగాథం నెలకొంది. అది అంతకంతకూ పెరిగింది. మోడీ ప్రధాని అయ్యాక అద్వానీని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఐతే ఇప్పటిదాకా ఏమైనా జరగనీ రామ మందిర శంకు స్థాపన అనే మహోన్నత ఘట్టంలో అద్వానీ కచ్చితంగా పాలుపంచుకోవాలన్నది ఆయన అభిమానులతో పాటు బీజేపీ కార్యకర్తల ఆకాంక్ష. మరి మోడీ ఏం చేస్తాడో చూడాలి.